in , ,

ప్రమాదంలో రిషబ్ పంత్, డివైడర్ ని ఢీ కొట్టిన కారు

‘రిషబ్ పంత్’ క్రికెట్ లో తనదైన శైలిలో డేరింగ్ & డాషింగ్ బ్యాటింగ్ తో లక్షల సంఖ్య లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ యువ భారత క్రికెటర్ ఈరోజు ఉదయం రోడ్ ఏక్సిడెంట్ కి గురయ్యారు. ఈ ఘటన రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా నర్సన్ ప్రాంతం దగ్గర తెల్లవారు జామున సుమారు 5:30 కి అయినట్టు సమాచారం. పంత్ తన కారులో ఒంటరిగా ప్రయాణిస్తుండగా డివైడర్ రైలింగ్ ని ఢీ కొట్టిన కారు పల్టీలు కొట్టి నిప్పు రాచుకొని పెద్ద మంటలు ఎగిసాయి.పెద్ద శబ్దం కావడం తో గ్రామస్తులు అప్రమత్తమై స్థానిక పోలీసుల సహాయంతో అక్కడికి చేరుకొని పంత్ ని ప్రమాదం నుంచి తప్పించి దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ్నుంచి డెహ్రాడున్ లోని పెద్ద ఆస్పత్రి కి తరలించి చికిత్స అందించారు.

ప్రమాదం లో పంత్ తల,చేయి,కుడికాలు,వెనుక భాగంలో గాయాలతో బయట పడ్డారు. ఇంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన పంత్ స్పృహలో ఉండి మాట్లాడ్తున్నారని, ఈ ప్రమాదం బహుశా పంత్ కు నిద్ర రావడం వల్లే జరిగి ఉండొచ్చని పోలీసుల కథనం. ప్రమాదం లో కాలిపోయిన కారు పై తదుపరి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తాం అని పేర్కొన్నారు. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు, పలువురు క్రికెటర్లు సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.
గెట్ వెల్ సూన్ ‘రిషబ్ పంత్’.

What do you think?

123 Points
Upvote Downvote

కాంతారా సినిమా – రివ్యూ

చిరంజీవి, రామ్ చరణ్ ఓ.టి.టి లోకి అడుగుపెట్టబోతున్నారా?