in

ఒక్క ఓవర్లో 7 సిక్సర్లా, ఇదెక్కడి మాస్ రా మామా…!

Ruturaj

ఒక్క ఓవర్లో 6 సిక్సర్లు వేయడం చూసుంటారు.కానీ ఒక్క ఓవర్లో 7 సిక్సర్లు వేయడం చూసారా….మీకు ఇది వినడానికే వింతగా ఉంది కదూ. కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. అసలు అలా ఎలా జరిగిందితెలియాలంటే విషయం చదవాల్సిందే.

ఇటీవలే మహారాష్ట్రకు ఉత్తరప్రదేశ్ జట్టుకు మధ్య జరిగిన హజారె ట్రోఫీ వన్డే టోర్నీ క్వార్టర్ ఫైనల్స్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ- బి మైదానంలో చోటు చేసుకుంది. అయితే రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ చేస్తుండగా 49వ ఓవర్లో యెడమచేతి వాటం ఉన్న స్పిన్నర్ శివ సింగ్ బౌలింగ్ వేయడానికి దిగాడు. శివ సింగ్ వేసిన 4 బంతులను సిక్సర్లుగా మలిచిన గైక్వాడ్ అయిదో బంతిని కూడా సిక్సర్ బాధగా అది నోబాల్ కావడంతో ఫ్రీ హిట్ దొరికింది. ఫ్రీ హిట్ కూడా మిడ్ వికెట్లో  స్టాండ్స్కు చేరుకుంది. చివరి బంతిని రౌండ్ ద వికెట్ వేసినా ఫలితం ఏమీ మారలేదు.

దీంతో 7 బంతులకు 7 సిక్సులు వచ్చాయి. అలా రికార్డ్ సృష్టించిన గైక్వాడ్ ఆ ఒక్క ఓవర్లో 43 పరుగులను సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో గైక్వాడ్ 159 బంతుల్లో 220 పరుగులు చేసి నాట్ ఔట్గా నిలువగా,అజయ్ డబుల్ సెంచరీ సాధించాడు. ఉత్తరప్రదేశ్ 47.4 ఓవర్లలో 272 పరుగులతో ఆలౌట్ కాగా మహారాష్ట్ర 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 330 పరుగులతో సేమిసేకి చేరుకుంది.

What do you think?

49 Points
Upvote Downvote

అదరగొడుతున్న భారత్ షూటర్లు…

కన్నీళ్లు పెట్టుకున్న ఇరాన్ ఆటగాడు తరేమి, ఇరాన్ ఫుట్బాల్ టీంను జైలుకు పంపిస్తామని హెచ్చరిక…