in

క్రీడా ప్రపంచానికి వీడ్కోలు చెప్పిన రోజర్ ఫెడరర్, “శరీరం ఇస్తున్న సందేశాలు నాకు అర్ధమయ్యాయి”

రెండు ఒలింపిక్ మెడల్స్,బెస్ట్ ఇంటర్నేషనల్ అథ్లెట్ అవార్డు,6 సార్లు వరల్డ్ టూర్ ఫైనల్ చాంపియన్,28 సార్లు మాస్టర్ ఛాంపియన్,డేవిస్ కప్ ఛాంపియన్ ఇలాంటి ఎన్నో అవార్డులు అందుకోవడంతో పాటు అద్భుతాలు సృష్టించిన టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెడరర్. 24 సంవత్సరాలలో 15000 మ్యాచ్లు ఆడిన 41 ఏళ్ల టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెడరర్ ఇటీవలే పదవి విరమణ ప్రకటించాడు. లేవర్ కప్ తరువాత తను ఇకపై ఆడబోడని ట్విట్టర్ మాధ్యమం ద్వారా ప్రకటించాడు.కొన్ని సంవత్సరాలుగా రోజర్ అనుకోని ఇబ్బందులను ఎదుర్కుంటునాడు. 2020లో రెండుసార్లు మోకాలికి దెబ్బ తగిలి సర్జరీలు జరగగా, 2021లో హుబెర్ట్ తో ఆడి ఓడిపోయిన మ్యాచ్లో కూడా గాయపడ్డాడు. ఇలా ఎన్నో గాయాలు, ఎన్నో ఇబ్బందులు.

ఈ విషయం పై రోజర్  ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ మూడేళ్లుగా గాయాలు, సర్జరీల రూపంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానాని,తనని తను భౌతికంగా బలపరుచుకోవడానుకి ఎంతో కష్టపడ్డానని తెలిపారు. కానీ అదే విధంగా తన శరీర సామర్థ్యం, హాద్దులు తనుకు తెలుసని ఇకపై ఆడడానికి తన శరీరం సహకరించడం లేదని ఇటీవలే శరీరం ఇస్తున్న సందేసాలు తనకు అర్థమైయాయని అన్నారు.

24 సంవత్సరాలు ఆడిన విషయానికి వస్తే అవి 24 గంటల్లా ముగిసిపోయాయని,తన జీవితాన్ని సంపూర్ణంగా జీవించిన ఆనందం తనకుందని తెలిపారు. 22 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ రఫెల్ నాడల్ ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ ఇలాంటి రోజు వచ్చి ఉండ కూడాదని,వ్యక్తిగతంగా తనకు మరియు క్రీడా ప్రపంచానికి ఇది బాధాకరమైన రోజని అన్నారు.రోజర్ ఫెడరర్ ట్విట్టర్లో చివరిగా తన కుటుంబానికి,తన అభిమానులకు,స్పాన్సర్లు మనస్పూర్తిగా కతఙ్ఞతలు తెలిపాడు.

What do you think?

114 Points
Upvote Downvote

కన్నీళ్లు పెట్టుకున్న ఇరాన్ ఆటగాడు తరేమి, ఇరాన్ ఫుట్బాల్ టీంను జైలుకు పంపిస్తామని హెచ్చరిక…

గోల్డ్ మెడలిస్ట్ నుంచి తనను తాను పోషించుకొలేని స్థితికి పడిపోయిన మీనాక్షి రాణీ.