in

2022లో అద్భుతమైన ప్రతిభతో అవార్డులు అందుకున్న భారత్ ఆటగాళ్ళు…

2022లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్లో అద్భుతమైన ప్రతిభ చూపిన ఆటగాళ్ళను రాష్ట్రపతి భవన్లో భారత్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముర్ అవార్డులతో సత్కరించారు.

భారత దేశ సీనియర్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ కనపరిచిన అద్భుతమైన ఆటను అభినందిస్తూ మూడు గోల్డ్ మెడల్లు,ఒక సిల్వర్ మెడల్ సాధించిన అతన్ని మేజర్ ద్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుతో సత్కరించారు. ఈ ఏడాది ఐబిఎ ఉమెన్స్ ఓల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ పొంది భారత్ నుంచి గోల్డ్ మెడల్ సాధించిన ఐదోవ మహిళగా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. అలాంటి ప్రతిభ చూపినందుకు గాను నిఖత్ జరీన్కు అర్జున అవార్డును అందించారు.

అదే విధంగా బ్యాడ్మింటన్ ప్లేయర్లు లక్ష్య సేన్,ప్రన్నాయ్లకు వారు కనపరిచిన ఆటకు గాను అర్జున అవార్డ్ను అందించారు. తన జీవిత కాలంలో క్రికెట్కు అందించిన సేవలకు గాను భారత్ క్రికెట్ టీమ్ రోహిత్ శర్మకు కోచింగ్ ఇచ్చిన దినేష్ లడ్కును ద్రోణాచార్య అవార్డుతో సత్కరించారు. సీమా పూనియా,ఆల్డస్ పాల్లకు అథ్లెటిక్స్కు గాను,భక్తి కులకర్ణికి మరియు అర్ ప్రజ్ఞానంద్లకు చెస్లో అద్భుతమైన ప్రతిభను కనపరిచినందుకు గాను అర్జున అవార్డును అందచేశారు.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ముర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. అలా అవార్డులు అందుకున్న ఆటగాళ్ళు అందరూ సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు.

What do you think?

79 Points
Upvote Downvote

రేషన్ బియ్యం అక్రమ తరలింపు, పట్టుకున్న విజిలెన్స్ అధికారులు

మరో సారి చరిత్ర సృష్టించిన రోనాల్డో…కానీ ఈ సారి ఆటలో కాదు.