టీంమిండియా స్పిన్నర్ యూజ్వేంద్ర చహల్ ఒక కొత్త రికార్డును తన కాతాలో వేసుకున్నాడు. అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు.
వివరాల్లోకి వెళ్తే లక్నో వేదికగా భారత్ కు, న్యూజిలాండ్ కు ఇటీవల రెండో టీ20 మ్యాచ్ చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో ఒక్క వికెట్ పడగొట్టిన చహల్ అంతర్జాతీయ టీ20లో అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. యుజి చహల్ ఇప్పటి వరకు జరిగిన 75 మ్యాచ్లో 91 వికెట్లు పడగొడ్డాడు.
అయితే ఇప్పటి వరకు టీమిండియా వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్(90) పేరిట ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు మ్యాచ్లో చహల్ భువీ రికార్డును బ్రేక్ చేశాడు. ఆ విధంగా ఈ అరుదైన రికార్డును తన కాతాలో వేసుకున్నాడు. ఇక మొత్తంగా టీ 20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కివీస్ వెటరన్ పేసర్ టిమ్ సౌథీ 107 మ్యాచ్లో 134 అగ్రస్థానంలో ఉండగా.. 109 మ్యాచ్లో 128 వికెట్లతో షకీబ్ అల్ హసన్ రెండోవ స్థానంలో మరియు 74 మ్యాచ్లో 122 వికెట్లతో రషీద్ ఖాన్ మూడోవ స్థానంలో ఉన్నారు.
ఒక కొత్త రికార్డును తన కాతాలో వేసుకుని అందర్నీ అవాక్కయ్యేలా చేసిన టీంమిండియా స్పిన్నర్ యూజ్వేంద్ర చహల్.
