in ,

భారీ రికార్డును సొంతం చేసుకున్న కేన్ విలియమ్సన్

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రాస్ టేలర్ను అధిగమించి టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.

ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో 132 పరుగులు చేసి టెస్టుల్లో 26వ శతకాన్ని పూర్తి చేసుకున్న
కేన్ విలియమ్సన్ భారీ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. రాస్ టేలర్ ని అధిగమించి టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ క్రికెటర్ గా నిలిచాడు.

ప్రస్తుతం విలియమ్సన్ (7787) పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రాస్ టేలర్ (7683) రెండో స్థానంలో నిలిచాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్ (7172) పరుగులు, బ్రెండన్ మెక్ కల్లమ్ (6453) పరుగులతో ఆ తర్వాతి మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. రాస్ టేలర్ 196 ఇన్నింగ్స్ లో ఫీటిని సాధించగా.. విలియమ్సన్ 161 ఇన్నింగ్స్ ల్లోనే టేలర్ రికార్డుని బ్రేక్ చేసి ఆ రికార్డును తన సొంతం చేసుకున్నాడు.

What do you think?

డాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన యువకుడు

ప్రీతి మృతికి కారణమైన వాళ్ళని వదిలేది లేదు-కేటీఆర్