in

డాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన యువకుడు

19 ఏళ్ల యువకుడు డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. రెప్పపాటు కాలంలో ప్రాణాలు విడిచాడు. ఈ హృదయ విధారకమైన సంఘటన తెలంగాణాలోని నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్టీ(కె) గ్రామంలో ఆ గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుని వివాహం బైంసా మండలంలోని కామేల్ గ్రామంలో శుక్రవారం జరిగింది. ఆ మరుసటి రోజు పార్టీ(కె) “లో వివాహ వేడుకకు సంబంధించిన రిసెప్షన్ జరిగింది. ఈ రిసెప్షన్ కి పెళ్లి కుమారుని సమీప బంధువు, స్నేహితుడైన 19 ఏళ్ల ముత్యం అనే యువకుడు కూడా వచ్చాడు.

పెళ్లికి వచ్చిన వాళ్లందరినీ ముత్యం డాన్స్ చేస్తూ అతను వేస్తున్న స్టెప్పులతో అలరించాడు. అయితే అప్పటి వరకు ఆనందంగా డాన్స్ చేస్తూ అలరిస్తున్న ముత్యం హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూపియాడు. ముత్యం పడిపోవడం చూసిన అక్కడున్న వాళ్ళు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పిటికీ అప్పటికే ముత్యం చనిపోయాడని వైద్యులు తెలియచేశారు.

మృతి చెందిన యువకుడు ముత్యం మహరాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన వాడు కావడంతో మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తరలించారు.

What do you think?

వినాయక్,మెగాస్టార్ల హిట్ కాంబో రిపీట్ కాబోతోందా?

భారీ రికార్డును సొంతం చేసుకున్న కేన్ విలియమ్సన్