in

భారత దేశంలో మొట్టమొదటి రేసింగ్ …అది కూడా హైదరాబాద్లో

అన్ని ఆటలలో ముందుంటున్న మన దేశం ఇప్పుడు కొత్తగా కార్ రేసింగ్ లోకి కూడా అడుగు పెట్టింది. ప్రతి దానిలో మనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటున్న తరుణంలో ఇలా ఫార్ములా-ఇ లోకి కూడా అడుగుపెట్టడం అందరికీ ఆనందం కలిగిస్తుంది.

భారత దేశ మొట్టమొదటి ఫార్ములా-ఇ రేసు ఇటీవలే హైదరాబాద్లో చోటు చేసుకుంది. సుందరంగా తీర్చిదిద్ధిన రేసింగ్ ట్రాక్టర్తో పాటు వేలాది మంది ప్రేక్షకులు కూర్చోవడానికి వీలుగా గ్యాలరీలు కూడా ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగిన ఈ రేసింగ్లో 6 బృందాలుగా మొత్తం 24 మంది పాల్గొన్నారు. వీరిలో సగం మంది మన దేశానికి చెందిన వారుండగా,మరో సగం మంది విదేశాలకు చెందినవారున్నారు. అంతే కాకుండా రేస్లో పాల్గొన్న వారిలో మన  హైదరాబాద్కు చెందినవారు కూడా ఉండడం విశేషం.

రేసర్లు ఐ మ్యాక్స్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఇమ్యాక్స్ వరకు రేస్ సర్క్యూట్లో ప్రాక్టీస్ రేస్ చేశారు. ట్రాక్ మొదట్లో నెమ్మదిగా రేస్ మొదలుపెట్టినప్పటికీ తరువాత వేగం పెంచి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రేస్ చేశారు. అలా ట్రాక్ పై మూడు ప్రాక్టీస్ రేసులూ జరిగాయి. హైదరాబాద్లో ఇంత పెద్ద స్థాయిలో రేసింగ్ నిర్వహించడం తొలిసారి కావడంతో అభిమానులకు ఈ సరికొత్త అనుభూతి సంతోషాన్ని కలిగించింది. ఇక ఈ ఫార్ములా-ఇ రేసింగ్ భవిష్యత్తుల్లో ఎంత మంది అభిమానులను సొంతం చేసుకుంటుందో, ఎన్ని అద్బుతాలు సృష్టిస్తుందో…చూడాలి.

What do you think?

45 Points
Upvote Downvote

“పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ పట్టించుకోవడం లేదు….”షాహిద్ అఫ్రిదీ

తన రూటే సెపరేటు అంటూ దూసుకుపోతున్న అల్లరి నరేష్