హర్యానా: 2016 లో జరిగిన రియో ఒలింపిక్స్ ముగిసిన తరువాత నుంచి హర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్, స్నాప్ చాట్ ల ద్వారా తనకు సందేశాలు పంపుతున్నాడని, కొంత కాలం క్రితం తనను ఆయన కార్యాలయానికి కూడా పిలిచి చెడుగా ప్రవర్తించాడని అన్నారు.
“నన్ను నువ్వు సంతోషంగా చూసుకుంటే నిన్ను నేను సంతోషంగా చూసుకుంటా” అంటూ దారుణంగా మాట్లాడి, లైగికంగా వేధించాడని ఆరోపించింది. ఆయనకు లొంగకపోవడం వల్లనే వేరే ప్రాంతానికి బదిలీ చేశాడని చెప్పుకొచ్చింది. ఇంతకు ముందు కూడా ఈయన చాలా మంది మహిళలను ఇలాగే వేధించాడని, కానీ వాళ్ళని ఏమైనా చేస్తాడని భయపడడంతో ఎవరూ బయటకు రాలేదని వివరించింది. ఈ విషయం పై హర్యానా హోంమంత్రి అనిల్ విజ్‌ను కలిసి ఆయనకు తన బాధను చెప్పుకుంటూ వాపోయింది.
ఆమె పిర్యాదు మేరకు చండీగఢ్ పోలీసులు లైగిక వేధింపులు,నిర్బంధ కేసుకు గాను 354, 354A, 354B, 342, 506 సెక్షన్ల కింద సందీప్ సింగ్ పై కేసును నమోదు చేశారు. ఈ విషయంపై క్రీడా మంత్రి,భారత్ హాకీ జట్టుకు మాజీ కెప్టెన్ అయిన సందీప్ సింగ్ మాట్లాడుతూ తను ఏ తప్పూ చేయలేదనీ,తనను చెడుగా చూపించడానికి ఇలా చేస్తున్నారని, వాళ్ళు చేసే ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. తన నిజాయితీని నిరూపించుకోడం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు తన రాజీనామా పత్రాన్ని అందజేశానని వెల్లడించారు. తను నేరం చేయలేదని కచ్చితంగా రుజువు అవుతుందని, అప్పటి వరకు క్రీడా శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి మనోహర్ లాల్ గారికి అప్పగిస్తున్నానని అన్నారు.
ఇక 2018లో ఈ సందీప్ సింగ్ జీవితం ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కగా ఇప్పుడు ఇలా ఈయన పై లైంగికంగా వేధించాడని ఆరోపణలు రావడంతో ఈ విషయం ఒక సంచలనంగా మారింది.