in

10వ తరగతి పరీక్షల టైం టేబుల్ – పరీక్షలు మళ్ళీ వచ్చేసాయి

కళ్ళు మూసి తెరిచే లోపే కొత్త సంవత్సరం వచ్చేసింది, ఇదిగో స్కూల్ మొదలైంది అనుకున్నమో లేదో సంవత్సరం ముగిసి పరీక్షలు కూడా వచ్చేశాయి. ఇంకో నాలుగు నెలల్లో పిల్లలు 10వ తరగతి పరీక్షలు కూడా రాయబోతున్నారు. మరి ఆ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి? ఎన్ని రోజులు జరుగుతాయి? తెలుసుకుందామా…

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ గురించి ఎపీ బోర్డ్ వాళ్ళు విద్యార్థులకు తెలిసేలా, అర్థమయ్యేలా కొన్ని రోజులకు ముందే వివరణ ఇచ్చారు. ఎపీలో 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 18 వరకు జరుతాయని వెల్లడించారు. అయితే ఈ పరీక్షలు మొత్తం 8 రోజులు జరగగా 4,5,7,9,11,12,14 మరియు 16 తేదీలలో మాత్రం పరీక్షలు చోటు చేసుకోవట. అన్ని పరీక్షలు ఒకే షిఫ్ట్ లో జరుగుతాయని బోర్డ్ పేర్కొనగా, పరీక్షలు ఉదయం 9:30 నిమిషాలకు మొదలై దాదాపు అన్ని పరీక్షలు మధ్యాహ్నం 12:45 నిమిషాలకు ముగుస్తాయట. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోసిట్, వొకేషనల్ కోర్స్ వాళ్ళకి 11:15 నుంచి 11:30 వరకు పరీక్ష జరుగుతుందట.

ఇక సిబీఎస్ఈ బోర్డ్ వాళ్ళు కూడా ఇటీవలే 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై మార్చ్ 21న ముగుస్తాయట.

ఎపీ పది పరీక్షల టైం టేబుల్:

ఎస్.ఎస్.సి పరీక్ష సబ్జెక్ట్ – తేదీ

ఏప్రిల్ 3,2023 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -1
ఏప్రిల్ 6,2023 – సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 8,2023 – ఇంగ్లీష్
ఏప్రిల్ 10,2023 – మత్మేటిక్స్
ఏప్రిల్ 13,2023 – సైన్స్
ఏప్రిల్ 15,2023 – సోషల్
ఏప్రిల్ 17,2023 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -2, ఓ.ఎస్.ఎస్.సి మెయిన్, లాంగ్వేజ్ పేపర్ -1
ఏప్రిల్ 18,2023 – ఎస్.ఎస్.సి వొకేషనల్ కోర్స్, ఓ.ఎస్.ఎస్.సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2

What do you think?

131 Points
Upvote Downvote

ఫస్ట్ డే ఫస్ట్ షో – రివ్యూ

యువ జట్టుతో టీమ్ ఇండియా టీ20 సీరీస్ షురూ…..