in

ఫస్ట్ డే ఫస్ట్ షో – రివ్యూ

రివ్యూ

“జాతి రత్నాలు ” సినిమాతో మంచి పేరును సంపాదించిన దర్శకుడు అనుధీప్ కె.వి.ఇప్పుడు ఆయన కొత్తగా ఒక సినిమాకు కథ అందించారు, ఆ సినిమానే ఫస్ట్ డే ఫస్ట్ షో. తన అభిమాన హీరో సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో హీరో చూడగలిగాడా అన్నదే ఈ సినిమా కథ. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసులు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ ఇంత చిన్న మామూలు కథ ఉన్నపుడు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే దర్శకుడు కొద్దిగా ఎక్కువగానే కష్టపడాల్సి వస్తుంది. కథనం కొత్తగా ఉండేలా చూసుకోవాలి,ప్రతి క్షణం ప్రేక్షకులను అలరించేలా సినిమాను తెరకెక్కించాలి.

కానీ ఈ సినిమాకు అక్కడే పొరపాటు జరిగింది. ఇద్దరు దర్శకులు ఉన్నపటికీ సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో తేడా జరిగింది. వెన్నెల కిషోర్,శ్రీనివాసరెడ్డిలు ఎప్పటిలాగే తమ నటనతో ప్రేక్షకులను నవ్వించడంలో సఫలమైయారు. అనుదీప్ రాసిన సన్నివేశాలు అక్కడక్కడ నవ్వించినప్పటికీ సినిమా మొత్తం మీద అవి తేలిపోయాయి. సంగీత దర్శకుడు రథన్ అందించిన సంగీతం సినిమాకు కొంచెం బలం చేకూర్చింది. మొత్తం మీద సినిమా అలా అలా సాగి పోయింది.

బలాలు:

  • శ్రీకాంత్ రెడ్డి,సంచిత బసు
  • రథన్ అందించిన సంగీతం

బలహీనతలు:

  • కథ,కథనం
  • సాగుతున్నటుండే సన్నివేశాలు

చివరిగా: ఫస్ట్ డే ఫస్ట్ షోకు ఒక సారి వెళ్లొచ్చు.

నటీనటులు: శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు,తనికెళ్ల భరణి,శ్రీనివాసరెడ్డి,ప్రభాస్ శీను,వెన్నెల కిషోర్, వంశీధర్ గౌడ్ తదితరులు

What do you think?

122 Points
Upvote Downvote

గాలోడు సినిమా – రివ్యూ

10వ తరగతి పరీక్షల టైం టేబుల్ – పరీక్షలు మళ్ళీ వచ్చేసాయి