in

రణస్థలి సినిమా – రివ్యూ

కథ ఉంటే చాలు కథానాయకులు ఎవరైనా చూస్తామని రణస్థలి సినిమాతో మరోసారి నిరూపించారు తెలుగు ప్రేక్షకులు. దర్శకుడు పరశురామ్ శ్రీనివాస్ తెరకెక్కించిన రణస్థలి సినిమా కథ కొత్తదేమీ కానప్పటికీ దాన్ని తీర్చిదిద్ధిన విధానం,దాని కథనం చాలా వినూత్నంగా ఉంటుంది. సినిమాలోని సన్నివేశాలు కూడా చాలా ఆసక్తికరంగా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయి. ధర్మ, అమ్ము అభిరామి, చాందిని, సమ్మెట గాంధీ తదితర నటీనటులు వారి పాత్రలల్లో ఒదిగి పోవడంతో సినిమా అంతా చాలా సహజంగా, నిజజీవితానికి అద్దం పట్టేలా ఉంటుంది.

కొన్ని సన్నివేశాలలో మాత్రం హింస ఎక్కువగా ఉండడంతో కుటుంబంతో వచ్చే  ప్రేక్షకులు కొంచెం ఇబ్బందికి గురౌతుంటారు. కేశవ్ కిరణ్ అందించిన సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. మొత్తంగా సినిమా మొదటి నుంచి చివరి వరకు ఆసక్తికరంగా సాగిపోతుంది.

నటీనటులు: ధర్మ, అమ్ము అభిరామి,సమ్మెట గాంధీ,చాందిని,ప్రశాంత్, విజయ్ రాగం,నాగేంద్ర,శివ జామి తదితరులు, దర్శకుడు: పరశురామ్ శ్రీనివాస్, సంగీతం: కేశవ్ కిరణ్, నిర్మాత: అనుపమ సురెడ్డి

బలాలు:

  • కథ,కథనం
  • నటీనటులు
  • సంగీతం

బలహీనతలు:

  • సాగేటట్టు ఉండే కొన్ని సన్నివేశాలు

చివరిగా: రణస్తలి రంజింపచేస్తుంది.

What do you think?

51 Points
Upvote Downvote

రంగ రంగ వైభవంగా – రివ్యూ

థియేటర్ నా, ఓ.టి.టి నా….? నిలిచేది ఏది?