in ,

నూతన విద్యా విధానం లో వినూత్న ప్రయోగం.. ఫలించేనా ?

నూతన విద్యా విధానం లో వినూత్న ప్రయోగం…

ఒక దేశం అభివృద్ధి, వెనుకబాటుతనం అక్కడ ఉన్న విద్యా వ్యవస్థ పై ఆధారపడి ఉంటుంది.

“ఒక దేశం పై విజయం సాధించాలంటే యుద్ధం చేయాల్సిన పనిలేదు ఆ దేశ విద్యా వ్యవస్థను నాశనం చేస్తే చాలు” ఒక విద్యా వేత్త చెప్పిన అక్షర సత్యాలు.
ఒక యుద్ధం వలన వచ్చే నష్టం తాత్కాలికం. ఒక దేశ విద్యా వ్యవస్థ సరిగా లేకపోతే ఆ నష్టం కొన్ని తరాలు వరకు వెంటాడుతూనే ఉంటుంది.

దేశాన్ని ప్రపంచం లో అగ్రస్థానం లో నిలపాలన్న తపన ప్రతి విద్యార్ధి లోను ఉండాలి. విద్యా విధానంలో సంచలన మార్పులు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే 1985 నుండి అమలులో ఉన్న మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చింది. ఉన్నత విద్యలో ప్రధాన సంస్కరణలను చేసింది. 2030 నాటికి అందరికీ విద్య అందించడమే లక్ష్యంగా ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది.

బహు భాషా బోధన దిశగా నూతన విద్యా విధానం ను సవరించారు.
“ఈ విధానం నిరంతర అభ్యాసంలో భాగంగా విజ్ఞాన సృష్టి, ప్రసారం, ఉపయోగం, అవిచ్ఛిన్న జ్ఞాన వ్యాప్తిల గురించి తెలియజేస్తుంది” ఎంతో తాత్త్వికంగా ఉన్న ఈ మాటలు కేంద్రం ఆమోదించిన విద్యా విధాన ప్రతిలో చిట్టచివరి వాక్యాలు.

@నూతన విధ్య విధానం లో మార్పులు ఇలా ఉన్నాయి…

1. 3 నుంచి 18 ఏళ్ల వరకు అందరికీ విద్య తప్పనిసరి.

2. 2030 నాటికి అందరికీ విద్య అందించడమే లక్ష్యం.

3. 6 వ తరగతి నుంచి కోడింగ్, ప్రోగ్రామింగ్ కరిక్యులమ్, వొకేషనల్ ఇంటిగ్రేషన్ కోర్సులు.

4. M.Phil కోర్సును పూర్తిగా తొలిగింపు.

5.10+2+3 (టెన్త్, ఇంటర్, డిగ్రీ) విద్యా విధానం కు స్వస్తి.. .ఇక నుంచి 5+3+3+4 విద్యా విధానం ప్రారంభం.

6. డిగ్రీ విద్య మూడు నుంచి నాలుగేళ్లు.

7. పీజీ విద్య ఏడాది లేదా రెండేళ్లు.

8. ఇంటర్ విద్య ఉండదు.

9. ఇంటిగ్రేటెడ్ పీజీ, యూజీ విద్య ఐదేళ్లు.

10. దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యకు ఒకటే కరిక్యులమ్.

11. పాఠ్యాంశాల భారం తగ్గించే కాన్సెప్ట్ నేర్పే ప్రయత్నం.

12. ఇక నుంచి కస్తుర్బా గాంధీ బాలిక విద్యాలయ కేవలం
12వ తరగతి వరకు మాత్రమే.

13. రీసెర్చ్ ఇంటెన్సివ్ లేదా టీచింగ్ ఇంటెన్సివ్ యూనివర్సిటీలు, అటానమస్ డిగ్రీ గ్రాంటింగ్ కాలేజీలు, మోడల్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
యూనివర్సిటీలకు ఆమోదం.

@5+3+3+4 విద్యా విధానం గురుంచి క్లుప్తం గ….
** మొదటగా 5 సంవత్సరాల కోర్సు లో 3 నుండి 6 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలతో పాటు 6 నుండి 8 సంవత్సరాల పిల్లలు ఉంటారు.
దీన్నే ఫండమెంటల్ కోర్స్ అంటారు.

3-6 సంవత్సరాల పిల్లలకు బేసిక్ కాన్సెఫ్ట్స్ నేర్పిస్తారు.

6 -8 సంవత్సరాల పిల్లలకు 1, 2 తరగతులు ప్రవేశపెట్టారు.

** తర్వాత 3 సంవత్సరాల కోర్స్ లో 8 నుండి 11 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు ఉంటారు.

వీరు 3, 4, 5 తరగతులు చదవటం జరుగుతుంది.

** మరొక 3 సంవత్సరాల కోర్స్ లో 11 నుండి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు ఉంటారు.

వీరు 6, 7, 8 తరగతులు చదవటం జరుగుతుంది. (వీటిలో ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ నేర్పించటం తో పాటు ఇంటర్న్ షిప్, ఒకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ప్రవేశ పెట్టారు.)

** చివరి 4 సంవత్సరాల కోర్స్ లో 14 సంవత్సరాల వయసు కల్గిన పిల్లలనుండి 18 సంవత్సరాల వయసు కల్గిన పిల్లలు ఈ కోర్స్ లో ఉంటారు. ఇందులో ఇంటర్మీడియట్ బదులుగా 9, 10, 11, 12 తరగతులుగా విభాగించారు. ఇది క్లుప్తం గా ఇక నుంచి అమలు చేయబడే 5+3+3+4 విద్యా విధానం.

సుమారు ముప్పై నాలుగేళ్ళ తర్వాత ఈ విద్యా విధానం మార్పునకు గురి అయ్యింది.
ఇప్పటి వరకు కొనసాగిన విద్యావిధానం 1986 లో రూపొందించారు. దానిని 1992 లో సవరించారు. 2016 మే లో కొత్త విద్యావిధానం రూపకల్పన పై కేంద్ర మాజీ క్యాబినెట్ కార్యదర్శి టి ఎస్ ఆర్ సుబ్రహ్మణియన్ నేతృత్వం లో కమిటీ ఒక నివేదిక సమర్పించింది. అనంతరం ఇస్రో మాజీ హెడ్ కె కస్తూరి రంగన్ నేతృత్వం లో దీనిపై రిపోర్ట్ ఇచ్చింది. దీనినుండి 2020 జాతీయ నూతన విద్యా విధానం రూపొందించబడింది. ఈ విద్యావిధానాన్ని 22 భాషలలోకి అనువదించటం జరిగింది.

@ఈ విద్యావిధానం లో లోపాలు:

>అయితే, కోర్సు నిబంధనలు సులభతరం చేసినంతగా, పరీక్షలను సులభతరం చేస్తే, మార్కులు వేసే వారు చేసే దుర్వినియోగాలను అరికట్టడం ఎలానో ఈ పత్రం చర్చించలేదు.
>తాజా పాలసీ అకడమిక్ అంశాలను టచ్ చేసినా, సిస్టమేటిక్ మార్పులపై ఎక్కువ దృష్టి పెట్టింది.
>ఒకప్పుడు కేంద్రానికి సంబంధం లేని, రాష్ట్రాల బాధ్యతగా ఉన్న విద్యను ఇందిరా గాంధీ.. రాష్ట్రం- కేంద్రం ఉమ్మడి వ్యవహారంగా మార్చారు. ఇప్పుడు మోదీ పూర్తిగా కేంద్రం చేతుల్లో ఉంచేలా కొత్త పాలసీ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషణ వినిపిస్తోంది.
> విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచడం, అంతర్గత పరీక్షల్లో పారదర్శకత పెంచడం, వ్యాపార కోణాన్ని
తగ్గించడం చాలా ముఖ్యం. అన్నిటికీ మించి బడి బయట ఉన్న వారిని బడిలోకి తేవడం, ఆ విద్యార్థులకు ఉపాధ్యాయులు అంకితభావంతో పాఠాలు చెప్పేలా తీర్చిదిద్దేలా చూడడం అనేదే పెద్ద సవాల్. వీటన్నిటినీ ఎలా సాధిస్తారన్నదానిపైనే విద్యా రంగ విజయం ఆధారపడి ఉంటుంది.

@చేయాల్సిన మార్పులు:

> ఈ తరం విద్యార్థులు తరగతి గది కె పరిమితమవుతున్నారు. మిగతా ప్రపంచం తో వారికీ సంబంధం ఉండడం లేదు. వారిలో సామజిక భాగస్వామ్యం కొరవడుతోంది. మన విద్యావ్యవస్థలో సమూల మార్పు జరగాల్సిన సమయం ఆసన్న మయింది సవాళ్ళను ధీటుగా ఎదుర్కునే సామర్ధాన్ని అలవర్చే విద్యా విధానాన్ని అభివృద్ధి చేయడం అవసరం..
>సామజిక అంశాలపై స్పృహ కల్గిన పౌరుల్ని తయారు చేసేలా విద్యా వ్యవస్థలు కృషి చేయాలి. మన చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ దార్శినికతతో మిళితం చేసేలా ఉండాలి. సరి అయిన అవగాహన, పరిజ్ఞానంతో సమాజాన్ని మార్చేందుకు అవసరమైన అవసరమైన దృక్పథాన్ని అలవర్చుకునేలా విద్యార్థులను తీర్చి దిద్దాలి.
>అది విద్యార్థులలో సామజిక అంశాలు, ప్రజాసమస్యల పై లోతైన అవగాహనతో పాటు, జాతీయ నిర్మాణ భావన ఒక రూపు సంతరించుకోడానికి దోహదం చేస్తుంది.
>దేశానికీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన వృత్తి విద్యా సంస్థల్లో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించటం ద్వారా అణగారిన వర్గాలకే కాదు, సామజిక ఆర్థిక మార్పునకు అద్భుతమైన వేదికలుగా నిలిచాయి. కానీ దూర దృష్టవశాత్తు ఇపుడు మన వృత్తి విద్యా కోర్సులు విధేయులైన పని వారిని తయారుచేయడానికి పరిమితమయ్యాయి. ఎక్కువ వేతనాలు వచ్చే లాభదాయకమైన ఉద్యోగాలు సాధించటమే వాటి లక్ష్యంగ మారిపోయింది.చరిత్ర, ఆర్ధిక, సామాన్య శాస్త్రాలు, భాషా శాస్త్రాలు, ఇతర సామజిక శాస్త్రాలు నిర్లక్ష్యం. చేయబడుతున్నాయి.
>ప్రొఫెషనల్ యూనివర్సిటీలకు వెళ్లిన తర్వాత కూడా విద్యార్థులు తరగతి గది కే పరిమితమవుతున్నారు. సంపూర్ణ విద్యా రెండు ప్రయోజనాలను సమతుల్యం చేస్తుంది . అది వ్యక్తిగత వికాసం మరియు సామజిక అభ్యున్నతి.

@ ఇతర దేశాలనుండి నేర్చుకోవాల్సిన అంశాలు:

>ఇతర కంట్రీస్ వలె ప్రతి ఒక్కరిని ప్రాక్టికల్ నాలెడ్జి మీద ఫోకస్ చేయించి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది.

>హెూమ్ వర్క్ :

ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం లో హెూమ్ వర్క్ అనే సిస్టం బాన్ చేయాలి. (or) హెూమ్ వర్క్ ను పది నుండి పది హేను నిమిషాలకు తగ్గించి. స్కూల్ వర్కౌట్ హౌర్స్ ను 3 నుండి 4 గంటలకే పరిమితం చేయాలి. టీచర్ 45 నిమిషాల క్లాస్ బోధన అనంతరం పదిహేను నిముషాలు స్టూడెంట్స్ కు బ్రేక్ తప్పనిసరి.

>పిల్లలకు వాళ్లకు వాళ్ళు కొత్త విషయాలు తెలుసునే అవకాశం ఇవ్వాలి. లోతైన ఆలోచన విధానాన్ని అలవరచాలి.

>పరిశుభ్రత నేర్పించాలి, స్వేచ్ఛా స్వతంత్ర భావ వ్యక్తి కరణ, ఎదుటివాళ్ళకు సహాయ పడే గుణాన్ని అలవరచటం.. >టీచర్స్ తో ఇంటరాక్షన్ అనేది ఎక్కువసంవత్సరాలు కొనసాగేలా చూడాలి. తద్వారా టీచర్ స్టూడెంట్ ఫామిలీ మెంబెర్ రేలషన్ ల కొనసాగుతుంది. పిల్లల మంచి ఎదుగుదలకు దోహదం చేస్తుంది.

>స్టూడెంట్స్ ఎటువంటి సిట్యుయేషన్ లో ఎలా రియాక్ట్ అవ్వాలో ప్రాక్టికల్ గా నేర్పించాలి.

>విద్య కు సంబంధించి ప్రివెయిటెకీకరణ రద్దు చేయాలి. ప్రభుత్వ అధీనం లోనే 99 శాతం నాణ్యమైన ఉచిత విద్య అందించటం ద్వారా విద్య విధానం లో మార్పు తీసుకురావాలి . దేశాన్ని ప్రపంచం లో అగ్రస్థానం లో నిలిపి ఈ మార్పులు ఫలించాలని ఆశిద్దాం…….

What do you think?

పరువు కోసం ప్రాణం బలి. కులాంతర వివాహం చేసుకుందని..

కుప్పకూలిన యుద్ధ విమానం. స్పాట్లో ముగ్గురు మృతి.