in

కుప్పకూలిన యుద్ధ విమానం. స్పాట్లో ముగ్గురు మృతి.

కుప్పకూలిన మిగ్- 21 యుద్ధ విమానం

 

యుద్ధ విమానం మిగ్- 21 సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. దీనికి సంభందించిన వీడియో నెటింట చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది. ఈ  ధారుణ ఘటన సోమవారం రాజస్తాన్ లో చోటుచేసుకుంది.

 

వివరాల్లోకి వెళ్తే ఈ సోమావారం సాధారణ శిక్షణలో భాగంగా సూరత్ గఢ్ ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన ఐఏఎఫ్ కు చెందిన మిగ్ – 21 యుద్ధ విమానం హాటాత్తుగా సాంకేతిక లోపం రావడంతో సూరత్ గఢ్ సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం నడుపుతున్న పైలేట్ పారాచూట్ సాయంతో బయట పడ్డాడు. కానీ దురదృష్టవశాత్తు విమానం ఒక ఇంటి మీద పడడంతో ముగ్గురు మృతి చెందారు.

ఈ ప్రమాదంపై ఐఏఎఫ్ స్పందిస్తూ ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టామని ట్వీట్ చేయగా.. పోలీసులు యుద్ధ విమానం కూలిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

బికనీర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఓం ప్రకాశ్ మాట్లాడుతూ, ప్రమాదంలో పైలట్ ప్రాణనష్టాన్ని నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేశాడని.. గ్రామ శివార్లలో విమానాన్ని క్రాష్-ల్యాండ్ చేశాడని వెల్లడించారు.

What do you think?

నూతన విద్యా విధానం లో వినూత్న ప్రయోగం.. ఫలించేనా ?

హలో ఫిల్మీ పీపుల్ జర భద్రం !మాటలు నమ్మారంటే అంతే..