in ,

మే 7 నుండి తెలంగాణ ప్రవేశ పరీక్షలు షురూ..

తెలంగాణ రాష్ట్రంలో ఎం సెట్ (Eam cet 2023) పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇటీవల విడుదల చేసింది. మే 7 నుండి తెలంగాణ ప్రవేశ పరీక్షలు షురూ కాబోతున్నాయి. తెలంగాణ ఎం సెట్ పరీక్షలు మే 7 నుంచి 14 వరకు నిర్వహిస్తుండగా.. ఎం సెట్ ఇంజనీరింగ్ పరీక్ష మే 7 నుంచి 11 వరకు జరగనుంది. ఆ తరువాత మే 12 నుంచి 14 వరకు అగ్రికల్చర్‌ మరియు ఫార్మా పరీక్ష జరగనుంది.

తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఎం సెట్ పరీక్షతో పాటు ఇతర ప్రవేశ పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది.
టీఎస్ ఎడ్‌సెట్‌ (TS Edcet) 2023 పరీక్ష మే 18 న, ఈసెట్‌ (E cet) మే 20న, లాసెట్‌ (Law cet) మే 25న , పీజీ ఎల్‌సెట్‌ మే 26న, ఐసెట్‌ (I cet) మే 27న, పీజీ ఈసెట్‌ (Pg E cet) మే 29 నుంచి జూన్ 1 వరకు జరనుందని ఉన్నత విద్యామండలి ఒక ప్రకటనలో పేర్కొంది.

పరీక్ష తేదీలు:
‌మే 7 – 14 తెలంగాణ ఎం సెట్ (ts Eam cet 2023)
‌మే 18 టీఎస్ ఎడ్సెట్ (TS Edcet)
‌మే 20 ఈసెట్ (E cet)
‌మే 25 లాసెట్ (Law cet)
‌మే 26 పీజీ ఎల్ సెట్
‌మే 27 ఐ సెట్ (I cet)
‌మే 29 – 1 జూన్ పీజీ ఈ సెట్ ( pg E cet)

What do you think?

చనిపోయాడని ఖననం చేసిన వ్యక్తి విడియో కాల్ చేసాడు.

కోహ్లిని ఎంత పొగిడినా తక్కువే- హర్భజన్ సింగ్.