in ,

17 గంటల పాటు తన చిట్టి తమ్ముడ్ని కాపాడుకున్న బుజ్జి అక్క.

భూకంపం కారణంగా కుప్పకూలిపోయిన భవనం యొక్క శిథిలాల మధ్య బుజ్జి అక్క తన చిట్టి తమ్ముడితో చిక్కుకుపోయింది. అయితే ఆ శిథిలాల మధ్య నలిగిపోతున్నా.. కూడా తన తమ్ముడికి ఏమీ కాకుండా తలపై చేయి పెట్టి ఆ బుజ్జి అక్క కాపాడుకుంది. ఈ సంఘటన బూకంపం వల్ల అల్లకల్లోలంగా మారిన సిరియాలో చోటు చేసుకుంది.
గత సోమవారం టర్కీలో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తు కారణంగా పొరుగు దేశం ఐన సిరియాలో అనేక ప్రాంతాలు అతలాకుతలం అయిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ భూకంపం కారణంగా అనేక మంది కుప్పకూలి పోయిన భవనాల శిథిలాల మధ్య చిక్కుకుపోయారు. అలా చిక్కుకుపోయిన వారిని కాపాడడానికి సహాయక సిబ్బంది రెండు రోజులుగా శ్రమిస్తున్నారు. అయితే భూకంప ప్రభావిత ప్రాంతంలో శిథిలాలను సహాయక సిబ్బంది తొలగిస్తుండగా.. ఆ శిథిలాల కింద అక్కాతమ్ముడు సజీవంగా కన్పించారు. సహాయక సిబ్బంది వెంటనే వారిని బయటకు తీసుకురావడంతో 17 గంటలు తరువాత ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ అక్కాతమ్ముళ్లకు సంబంధించిన ఫొటోను ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మహమ్మద్ సఫా తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. “శిథిలాల కింద 17 గంటల పాటు తన తమ్ముడి తలపై చేయి అడ్డుగా పెట్టి కాపాడిన 7 ఏళ్ల బాలిక సురక్షితంగా బయటపడింది. ఈ ఫొటోను ఎవరూ షేర్ చేయట్లేదు. ఒకవేళ మరణించి ఉంటే వైరల్ అయి ఉండేది. దయచేసి ఇలాంటి సానుకూల సందేశాలను కూడా షేర్ చేయండి” అంటూ ట్వీట్ చేశారు.

మరో వైపు ఈ అక్కాతమ్ముళ్ల ఫోటో చూసిన నెటిజనులు తమ్ముడ్ని జాగ్రత్తగా పట్టుకుని ఉన్న చిట్టి అక్కను ప్రశంసలతో ముంచెత్తున్నారు.

What do you think?

కోహ్లిని ఎంత పొగిడినా తక్కువే- హర్భజన్ సింగ్.

1392 పోస్టులను భర్తీ చేయనున్న టీఎస్పీఎస్సీ(tspsc).