in

‘మెగా బ్లాక్బస్టర్’ తో హిట్ మ్యాన్ తెరంగ్రేటం

‘రోహిత్ శర్మా’ఓపెనర్ బాట్స్మన్ గా రికార్డ్ స్థాయి స్కోర్ల తో ఇండియన్ క్రికెట్ టీమ్ కు సేవలు అందిస్తున్న ప్రస్తుత ఇండియన్ కెప్టెన్ రోహిత్ ను ఫాన్స్ ‘హిట్ మ్యాన్’ అని పిలుచుకుంటారు. రోహిత్ శర్మ నేతృత్వంలో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ మరియు హాంకాంగ్‌లను ఓడించి, 2022 ఆసియా కప్‌లో సూపర్ 4 దశలో ఉంది. రెండు నెలల వ్యవధిలో ప్రారంభం కానున్న T20 ప్రపంచ కప్‌తో భారత్‌ను ICC టైటిల్‌కు నడిపించనున్న రోహిత్ శర్మపై అందరి దృష్టి ఉంది. మొత్తంమీద, అనుభవజ్ఞుడైన బాట్స్మన్ కి ఇది కీలకమైన దశ.

ఇదిలా ఉండగా మన హిట్ మ్యాన్ ఇప్పుడు  ‘మెగా బ్లాక్బస్టర్’ అనే సినిమా ద్వారా నటన తోను అందర్నీ అలరించనున్నట్లు అయన తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. రోహిత్ తో పాటు ఫార్మెర్ ఇండియన్ కెప్టెన్ ప్రస్తుత BCCI ప్రెసిడెంట్ ‘సౌరవ్ గంగూలీ’ ,’కార్తీ’, ‘త్రిషా’, ‘కపిల్ శర్మా’, ‘రష్మిక మందన్న’ ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ గా ఉండటం విశేషం. ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు రోహిత్ శర్మా తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియచేశారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాలంటే సెప్టెంబర్ 4 వరుకు ఎదురు చూడాల్సిందే.

What do you think?

115 Points
Upvote Downvote

మరో సారి చరిత్ర సృష్టించిన రోనాల్డో…కానీ ఈ సారి ఆటలో కాదు.

రాజమౌళి కి న్యూయార్క్‌ ఫిలిం క్రిటిక్స్‌ సర్కిల్‌(NYFCC) ఉత్తమ దర్శకుడి అవార్డు, ఈ అవార్డు తో ఆస్కార్ వచ్చినట్టే…!?