ఒక్క రోజులో ఎవరూ కోటీశ్వరులు అవ్వరు. ఒక్క రాత్రిలో కష్టాలన్నీ తీరిపోవు. ఈ మాటలు రోజూ వింటూనే ఉంటాం. కానీ వీటిని తప్పని నిరూపిస్తూ ఓ వ్యక్తి అదృష్టం అతన్ని కోటిశ్వరుడిని చేసింది. అది కూడా ఒక్క రోజులో. అది ఎలా అంటారా.. అయితే ఈ స్టోరీ మీరు చదవాల్సిందే.
విషయం ఏంటంటే ఆస్ట్రేలియాలోని విక్టోరియా గోల్డ్ ఫీల్డ్స్ లో ఓ వ్యక్తి మెటల్ డిటెక్టర్ పట్టుకుని ప్రదేశం అంతా తిరుగుతున్నాడు. ఇంతలో అతనికి ఆ ప్రదేశంలో నాలుగున్నర కిలోల బరువున్న రాయి దొరికింది. దాన్ని కొంచెం పరీక్షించి చూసి అందులో బంగారం ఉందని తెలుసుకున్నాడు. దాని విలువ 5 లక్షల రూపాయల వరకైనా ఉంటుందని సంతోషపడ్డాడు. దాన్ని ఓ బంగారం వ్యాపారి దగ్గరికి తీసుకువెళ్లి చూపించాడు.
కానీ అతను ఆశించిన దానికంటే దేవుడు ఎక్కువ ఇద్దాం అని భావించినట్టు ఆ బంగారం వ్యాపారి దాని విలువ లక్షలు కాదు.. కోట్లు ఉంటుందని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి ఆనందానికి ఆవదులు లేకుండాపోయాయి. అలా ఒక్కరోజులో ఆ వ్యక్తి కోటీశ్వరుడైపోయాడు. అదృష్టం ఇదే మరి.