in

“ప్రాజెక్ట్ ఛీతా” వెల్కమ్ టు ఇండియా

సుమారుగా 70 సంవత్సరాలు నుంచి మనదేశంలో అంతరించిపోయిందనుకున్న ఛీతా జాతిని తిరిగి పెంపొందించాలని సంకల్పంతో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు సౌత్ ఆఫ్రికాలోని నమీబియా నుంచి ఎనిమిది ఛీతాలను తెప్పించారు. వాటికి అనువైన స్థలమేది అని చాలా ప్రదేశాలను ఆలోచించి, మధ్యప్రదేశ్ లోని ‘కూన’ అభయారణ్యాన్ని ఎంపిక చేశారు.

ఛీతాలు ఎంతో వేగంగా పరిగెత్తగలవు, అంతేకాకుండా వీటిని పూర్వకాలంలో పెంచుకునేవారు కూడా.. సౌత్ ఆఫ్రికాలోని ఛీతా జాతి మన దేశంలో ఉన్న జాతి కాదు. మన దేశంలో ఉన్న ఛీతాల జాతిని పోలిన జాతి ఛీతాలు ఇరాన్ దేశంలో ఉన్నాయి. చాలా మందికి మన దేశంలో ఉన్న జాతి వాటిని తీసుకురాకుండా వేరే  ఛీతాలను తీసుకురావడం వన్యప్రాణి సంరక్షణ ఉల్లంఘించడం అన్న అనుమానం ఉంది, అయితే దానికి ఇరాన్ దేశంలోని ఛీతాలు బలంగా లేకపోవడం కారణం, అంతేకాకుండా సౌత్ ఆఫ్రికాలోని ఛీతాల సంఖ్య కూడా ఎక్కువ.

ప్రాజెక్ట్ ఛీతాగా తీసుకొచ్చిన ఎనిమిది ఛీతాలలో ఐదు ఆడ ఛీతాలు , మూడు మొగ ఛీతాలు ఉన్నాయి.

14 సంవత్సరాల క్రితమే సౌత్ ఆఫ్రికా నుండి ఛీతాలను తీసుకువచ్చి మనదేశంలో ఛీతా జాతిని పెంపొందించాలన్న ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చినప్పటికీ, ఆ ప్రతిపాదనను అమలు చేసింది మాత్రం మన మోడీ గారు. ఇందుకు సుమారు 21 కోట్లు ఖర్చయ్యాయి. ఇక్కడకు తీసుకు వచ్చిన ఛీతాలు మన దేశ వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగి బతికితే, మరో 12 ఛీతాలను తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఖండాంతర తొలి ట్రాన్స్ లొకేషన్ గా పేరుగాంచిన మన ప్రాజెక్ట్ ఛీతా విజయవంతం అవ్వాలని ఆశిద్దాం.

What do you think?

232 Points
Upvote Downvote

“వాల్తేరు వీరయ్య” – రివ్యూ

ప్రపంచ సినీ చరిత్రలోనే మొదటిసారి, 5 లక్షల మంది కలిసి నిర్మించిన సినిమా “మంథన్”…!