in

ప్రపంచ సినీ చరిత్రలోనే మొదటిసారి, 5 లక్షల మంది కలిసి నిర్మించిన సినిమా “మంథన్”…!

ఒక సినిమాను ఒక నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. లేదా రెండు మూడు సంస్థలు కలిసి ఉమ్మడిగా నిర్మిస్తాయి కానీ ఒక సినిమాను 5 లక్షల మంది కలిసి నిర్మించారంటే నమ్ముతారా…?. నిజంగానే 5 లక్షల మంది కలిసి ఒక సినిమాను నిర్మించారట.

దేశంలో పాల ఉత్పత్తి కోసం పోరాడిన ‘వర్గీస్ కురియన్’ జీవితం ఆధారంగా దర్శకుడు శ్యామ్ బెనెగల్ తెరకెక్కించిన చిత్రం “మంథన్”. సినిమా తీయాలనుకునే దర్శకులు తమ దగ్గర కథ ఉండి నిర్మాతలు లేకపోతే తమ సినిమాకు కావలసిన మొత్తాన్ని క్రౌడ్ ఫండింగ్ ద్వారా సమకూర్చుకుంటారు. గుజరాత్ పాడి రైతుల జీవితాల్లో మార్పుతీసుకొచ్చి శ్వేత విప్లవ పితామహుడిగా పేరుపొందిన వర్గీస్ కురియన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో ‘గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్’ వాళ్ళు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారు.

అలా 1976లో విడుదలైన మంథన్ సినిమాను రైతులు అందరూ కలిసి ఒక్కొక్కరు 2 రూపాయలు చొప్పున వేయడం ద్వారా 5 లక్షల మంది కలిసి నిర్మాణంలో పాలుపంచుకున్నారు. నిర్మాణంలో తోడుగా నిలవడమే కాక, సినిమాను విజయవంతం చేయడానికి రైతులందరూ కలిసి ఎద్దుల బండ్లపై థియేటర్లకు వేల మంది కలిసి రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అదే విధంగా అప్పటి వరకు ఏ సినిమాను ఈ విధంగా నిర్మించకపోవడంతో భారతదేశంలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా 5లక్షల మంది సహాయంతో తెరకెక్కిన తొలి సినిమాగా మంథన్  చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో గిరీశ్ కర్నాడు, అమ్రిష్ పురి,స్మితా పాటిల్, నసీరుద్దీన్ ప్రధాన పాత్రలు పోషించారు.

What do you think?

112 Points
Upvote Downvote

“ప్రాజెక్ట్ ఛీతా” వెల్కమ్ టు ఇండియా

15 కిలోమీటర్లు ట్రైన్ కిటికీ బయట వ్రేలాడుతూ…! ఫోన్ కోసం ప్రాణం మీదకు తెచ్చుకున్న దొంగ…