చర్మం మనిషి శరీరాన్ని బయట ఉండే బ్యాక్టీరియా, కెమికల్స్ వాతావరణంలోని ఉష్ణోగ్రత నుంచి కాపాడుతుంది. ప్రతి చిన్న స్పర్శకు చర్మం వెంటనే మెదడుకు సందేశం పంపిస్తుంది. అంతటి సంక్లిష్టమైన చర్మాన్ని తయారుచేయడం సులువైన విషయం కాదు. అలాంటి అసాధ్యామైన పనిని ఇటలీకి చెందిన పరిశోధకురాలు సుసాధ్యం చేసి చూపింది. ఆరు సంవత్సరాలు కష్టపడి చివరికు మనిషి చర్మంలా పనిచేసే చర్మాన్ని (స్మార్ట్ స్కిన్) రూపొందించింది. ఈ చర్మం మనిషి చర్మం కంటే సున్నితంగా ఉండటంతో పాటు,సూక్ష్మజీవులను కూడా అనుభూతి చెందగలదు.
ఆస్ట్రియాలో ఉన్న గ్రాజ్ టెక్నికల్ యూనివర్సిటీలో పని చేస్తున్న అన్నా మరియా కాక్లిట్ తన బృందంతో యూరోపియన్ రీసెర్చ్ కౌన్సిల్(ERC) స్మార్ట్ కోర్ ప్రాజెక్ట్లో భాగంగా స్పర్శకు,ఉష్ణోగ్రతకు మరియు తేమకు స్పందిచగల చర్మాన్ని(స్మార్ట్ స్కిన్) రూపొందించింది. చదరపు మిల్లిమీటకు 2000 వ్యక్తిగత సెన్సార్లుండే ఈ హైబ్రిడ్ మెటీరియల్లో ప్రతి సెన్సార్కు ఒక విభిన్నమైన కలయిక గల మెటీరియల్ ఉంటాయట. ఆ మెటీరియల్లో హైడ్రోజెల్ రూపంలో ఉండే స్మార్ట్ పోలిమర్ చర్మం తేమకు,ఉష్ణోగ్రతకు బహిర్గతమైనప్పుడు గ్రహించి స్పందిపచేస్తుందని మరియా కాక్లిట్ తెలియచేశారు.