ప్రభాస్ కథానాయకుడిగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం అధరంగా ఏన్నో సినిమాలు వచ్చాయి కానీ వాటిల్లో చూడని కొత్త అంశాలను కూడా తెరపై చూపించడమే ఆదిపురుష్ ప్రత్యేకత అని దర్శకుడు ప్రెస్‌మీట్‌లో చెప్పారు. రాముడిలా ప్రభాస్, సీతగా కృతిసనన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపించనున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో గొప్ప నిర్మాణ విలువలతో తెరకెక్కించనున్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు నిర్ధారించారు.
అయితే, సినిమా సెట్స్‌పైకి వెళ్లి యేడాది కావొస్తున్న ఇంకా ఫస్ట్‌లుక్ రాలేదనే నిరాశలో ఉన్న ప్రభాస్ అభిమానులకి కొంచెం ఊరట కలిగించేలా సినిమా కి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్ ని చిత్ర యూనిట్ ఈరోజు రివీల్ చేసారు. రాముడిలా ప్రభాస్ లుక్ ఏవిధంగా ఉండబోతుందో కాన్సెప్ట్ ఆర్ట్ తో అంచనాలను తారా స్థాయికి తీస్కోని వెళ్ళారు.రాముడిలా ఉన్న ప్రభాస్ కాన్సెప్ట్ ఆర్ట్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. గత రెండు సినిమాల తో నిరాశ పరిచిన ప్రభాస్ ఈసారి మంచి హిట్ ఇచ్చి అభిమానుల ఆకలి తీరుస్తాడని ఆదిపురుష్ తో ప్రభాస్ కమ్‌బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ టాపిక్ ఇప్పుడు #ఆదిపురుష్ తో ట్రెండింగ్ లో ఉంది.