in

పాన్ – ఇండియా సీక్వెల్స్ తో సంచలనం…ఎటు చూసిన ఫ్రాంచైజ్ లదే హంగామా

తెలుగు,తమిళ్,హిందీ అని తేడా లేకుండా అన్ని సినిమా ఇండస్ట్రీలు ఒకే సినిమా ఇండస్ట్రీగా మారి పాన్ – ఇండియా సినిమాలుగా అంతర్జాతీయ లెవెల్ లో తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

అగ్ర దర్శకులలో ఒకరైన రాజమౌళి బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా స్థాయిని పెంచగా,ప్రశాంత్ నీల్ కె.జీ.ఎఫ్ తో దానిని ముందుకు తీసుకు వెళ్ళాడు. ఇప్పుడు ఆ స్థాయిని నిలబెట్టుకుంటూ ప్రతి దర్శకుడు పాన్ – ఇండియా సినిమాలను తీయడానికి పర్యత్నిస్తున్నారు.అయితే ఇప్పుడు వచ్చే ప్రతి పాన్ – ఇండియా సినిమా ఫ్రాంచైజ్ సినిమాలుగా తెరకెక్కడం గమనార్హం. వాటిలో ప్రశాంత్ నీల్ “కెజీఎఫ్”,లోకేష్ కనగ రాజ్ “విక్రమ్”,మని రత్నం “పొన్నియన్ సెల్వన్” పెద్ద దర్శకుల సినిమాలు కాగా చిన్న దర్శకులు కూడా అగ్ర దర్శకుల బాటలోనే నడుస్తున్నారు. బింబిసారతో హిట్ కొట్టిన మల్లిధి వశిష్ఠ, కార్తికేయ -2 తో బ్లాక్ బస్టర్ కొట్టిన చందూ మొండేటి, “హిట్- ది సెకండ్ కేస్”తో హిట్ కొట్టిన శైలేష్ కొలను వారిలో కొందరు కాగా తాజాగా ఈ లిస్ట్ లో అ!,కల్కి, జాంబి రెడ్డి సినిమాల దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా చేరబోతున్నారు.

ప్రశాంత్ వర్మ దర్శకుడుగా తేజ సజ్జ ,అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా రాబోతున్న “హను- మ్యాన్” ఫ్రాంచైజ్ రూపంలోనే  తెరకెక్కబోతోంది.ఇండియన్ సూపర్ హీరో సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా,హరి గౌర సంగీత దర్శకుడిగా, శివేంద్ర సినిమాటోగ్రఫర్ వ్యవహరిస్తున్నారు.

What do you think?

151 Points
Upvote Downvote

చర్మం కాని చర్మం స్మార్ట్ స్కిన్, సాంకేతిక అభివృద్ధిలో ఇదొక అధ్బుతం….!

రివ్యూ: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం (ZEE5 లో)