in

మోదీ గొప్ప నాయకుడని, భారత్ ను సంమర్ధవంతంగా పాలిస్తున్నారని పాక్ పత్రికలు మెచ్చుకుంటున్నాయి. మోదీ ఏం చేశారంటే..

పాక్ నాయకులు, పత్రికలు ప్రధాని మోదీ పై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. భారత్ ను సమర్థవంతంగా పాలిస్తున్నారని, ఆయనొక గొప్ప నాయకుడని మెచ్చుకుంటున్నాయి.
వివరాల్లోకి ఏడాదిగా పాకిస్థాన్ ఆర్ధిక సంక్షోభాన్ని,ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటుంది. దీనికితోడు అక్కడ వరదలు రావడంతో పాక్ పరిస్థితి మరింత దారుణం అయింది. పాకిస్తాన్ ఇప్పటి వరకు బార్డర్ పేరుతో చైనాతో పబ్బం గడుపుకుంది. కానీ ప్రస్తుతం చైనాలో రోజుకు లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తుండడంతో పాక్ ను ఇప్పుడు చైనా కూడా పక్కన పెట్టింది. మరో పక్క ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్దం మరింత తీవ్రంగా మారుతుండడంతో దేశంలో ఆర్ధిక వ్యవస్థ చెల్లా చెదురైంది. ఇలా ప్రపంచ దేశాలు మొత్తం ఏదో ఒక సమస్యతో అస్తవ్యస్తంగా ఉన్న ఈ పరిస్థితులలో పాక్ నాయకులు, ప్రజలు భారత్ ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
షహజాద్ చౌదరి అనే రాజకీయ, భద్రత, రక్షణ విశ్లేషకుడు ప్రధాని మోదీ భారత ప్రతిష్టను పెంచుకుంటూ పోతున్నారంటూ పత్రికలో రాశారు. ఆయన తన నైపుణ్యంతో భారత జీడీపీని 3 ట్రిలియన్ డాలర్లకు పెంచారని, విదేశాంగ విధానాలు అబ్బురపరుస్తున్నాయని ప్రశంసించారు.
ఆయన ఆధ్వర్యంలో వ్యవసాయ ఉత్పత్తులు కూడా రికార్డు స్థాయిలో అత్యుత్తమ స్థాయికి పెరిగాయని, ఐటీ పరిశ్రమ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో విస్తరించిందని అన్నారు. కాల పరీక్షకు తట్టుకుని భారత ప్రజాస్వామ్యం దృఢంగా నిలిచిందని షహజాద్ చౌధరి కొనియాడారు. మోదీ పాలనలో భారత్ చాలా అభివృధి జరిగిందని ఆయన పత్రిక కథనంలో రాశారు. అత్యధిక జనాభా కలిగిన భారత్ ను చాలా సమర్థవంతంగా మోదీ పాలిస్తున్నారని అన్నారు.
మోదీ పాలనలో భారత విదేశాంగ విధానం, భారత ఆర్థిక వ్యవస్థలు అభివృధి చెందాయని, ఆర్మీ వ్యవహారాలపైన ఆయన శ్రద్ధతో వ్యవహరిస్తారని పాక్ మాజీ ప్రధాని, మోదీపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. అయితే అప్పుడు ఆయన మాటలను వ్యతిరేకిస్తూ పాక్ పత్రికలు మాజీ ప్రధానిని ఏకి పారేసాయి.
కానీ ఇప్పుడు మాజీ ప్రధాని మాటలను కొట్టేసిన పాక్ పత్రికలే భారత్ ను మోదీ సమర్ధవంతగా పాలిస్తున్నారని ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.

What do you think?

పఠాన్ మూవీ రివ్యూ…

“బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు కించపరిచేటట్టు లేవు”