in

పెట్రోల్ ధర రూ.15కు పడిపోతుంది – మంత్రి గడ్కరీ

పెట్రోల్ ధర రూ.15కు పడిపోతుంది – మంత్రి గడ్కరీ

 

పెట్రోల్ ధర రానున్న కాలంలో గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. లీటర్ పెట్రోల్ ధర రూ.15 పడిపోయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు.

రాజస్తాన్ లోని ప్రతాప్ గఢ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి గడ్కరీ పాల్గొన్నారు. ప్రతాప్ గఢ్ లో రూ. 5600 కోట్ల విలువైన 11 జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రారంభించిన గడ్కరీ కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు.

భవిష్యత్ లో వాహనాలు 60% ఇథనాల్, 40% విద్యుత్ వాహనాలుగా మారుతాయని గడ్కరీ అన్నారు. ఇదే గనుక జరిగితే వాయు కాలుష్యం తగ్గుతుందన్నారు. ఇథనాల్ ఉత్పత్తి పెంచడం ద్వారా అటు ప్రజలకు, ఇటు రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

ఇప్పటికే ఈ విషయంపై హీరో మోటోకార్ప్, బజాజ్, టీవీఎస్, మారుతి, బెంజ్ సంస్థలతో కూడా చర్చించానని తెలిపారు. అదే విధంగా త్వరలో టొయోటా సంస్థ ఉత్పత్తి చేయబోతున్న కామ్రి కారు పూర్తిగా 100% ఇథనాల్ పైనే నడుస్తుందని పేర్కొన్నారు. ఆ కారు 40% విద్యుత్ ను కూడా ప్రొడ్యూస్ చేస్తుందని వివరించారు. ఆ కారును ఆయనే లాంచ్ చేయబోతునట్లుగా గడ్కరీ తెలిపారు.

అనుకున్న విధంగా ఇథనాల్, విద్యుత్ వాహనాల ఉత్పత్తి పెరిగితే ఇంధన దిగుమతుల కోసం భారత్ వెచ్చిస్తున్న 16 లక్షల కోట్ల రూపాయలు ఆదా చేయవచ్చుని.. అవి రైతులకు ఆదాయంగా మారుతాయని విశ్లేషించారు. ఆ తరువాత లీటరు పెట్రోల్ రూ.15 దొరికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

What do you think?

కొన్నాళ్ళు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్న సమంత.

దళితులన్న కారణంతో క్షవరం చేసేందుకు నిరాకరిస్తున్నారు