కేరళలో అరుదైన వ్యాధితో బాలుడు మృతి
కేరళలో 15 ఏళ్ల బాలుడు ఓ అరుదైన ఇన్ఫెక్షన్ తో చనిపోయాడు. దీంతో అప్రమత్తం అయిన ఆరోగ్య యంత్రాంగం ప్రజలను కలుషిత నీటితో స్నానం చేయవద్దని హెచ్చరించింది.
కేరళలోని అలప్పుళ జిల్లా పనవల్లికి చెందిన 15 ఏళ్ల బాలుడు ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్ సైఫలిటిస్ (PAM) అనే ఓ అరుదైన వ్యాధితో ఇటీవల మృతి చెందాడు.దీనిపై స్పందించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఈ వ్యాధి కారణంగా గతంలో కూడా కేరళలో ఐదుగురు మృతి చెందారని వెల్లడించారు.
అలప్పుళలో 2016లో ఒకరు, మలప్పురంలో 2019లో ఒకరు, కోజికోడ్ 2020లో ఒకరు, మలప్పురంలో ఇద్దరు, 2022లో త్రిశూర్ ఒకరు ప్రాణాలు కొల్పోయినట్లు తెలిపారు. ఇప్పుడు ఈ వ్యాధికి మరొకరు బలయ్యారని అన్నారు.
మరణాల రేటు 100శాతంగా ఉందని.. ఇప్పటివరకు ఈ వ్యాధికి గురైనవారందరూ ప్రాణాలు కోల్పోయారని.. మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ వ్యాధిపై పనిచేసే ప్రభావవంతమైన ఔషదాలు లేకపోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కలుషిత నీటితో స్నానం చేయవద్దని హెచ్చరించారు.