in ,

సూపర్ కాప్-తొమ్మిదేళ్ల నిరీక్షణ..”గర్ల్ నెంబర్166″

సూపర్ కాప్ – తొమ్మిదేళ్ల నిరీక్షణ ..” గర్ల్ నెంబర్ 166″

అది ముంబై మహానగరం..

జనవరి 22, 2013 అంథేరీ లో బడికి వెళ్లిన ఒక అమ్మాయి ఇంటికి తిరిగి రాలేదు. స్కూల్ కు వెళ్లిన పాపని డిసౌజా అనే వాడు కిడ్నాప్ చేసాడు. ఆ అమ్మాయి పేరు పూజ. తమ పాప ఇంటికి రాలేదంటూ తల్లిదండ్రులు D N నగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. ఆ అమ్మాయిని తీసుకుని పోయి తన ఇంట్లో నే దాచి పెట్టాడు కిడ్నాపర్. అయితే పూజ కిడ్నాప్ వార్త పేపర్ లోను, టీ వీ ల్లోనూ రావడంతో, వాడు భయపడి పోయాడు. ఆ అమ్మాయిని ఎం చేయాలో అర్ధం కాలేదు.

పోలీస్ లు ఈ కేసు ను చాల సీరియస్ గా తీసుకున్నారు. కిడ్నాప్ కేసు ను పరిష్కరించటం లో ఎక్స్పర్ట్ – అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అయిన రాజేంద్ర భోస్లే కు అప్పగించారు. పిల్లల కిడ్నాప్ కేసు లు వస్తే వాటిని పరిష్కరించేంత వరకు వదిలిపెట్టడు రాజేంద్ర. 2008 నుండి ఇలాంటి కేసు ల లో పిల్లల్ని ఎత్తుకొని పోయిన వారిని వెంటాడి వేటాడి వేటాడి పట్టుకుంటాడని పేరు. కాబట్టి పూజ కేసు కూడా రాజేంద్ర చేతికే వచ్చింది. తాను రిటైర్ అయ్యేవరకు 165 మంది పిల్లల కిడ్నాప్ కేసులను పరిష్కరించారు. తాను ఈ కేసు లో ఏంచేయాలో అర్థం కాలేదు.

దాంతో ఈ కేసు …”గర్ల్ నెంబర్ 166″గ మీడియా లో బాగా పబ్లిసిటీ అయ్యింది. మరో వైపు పిల్లలు లేని కారణంగా, భార్య సోనీ బాధ తట్టుకోలేక ఆ పాపని కిడ్నాప్ చేసాడు డిసౌజా. కిడ్నాప్ అయితే చేసాడు కానీ ఎం చేయాలో అర్ధం కాలేదు. పోలీస్ సెర్చింగ్ లు పెరిగిపోయాయి. ఊరంతా పాప ఫోటో లు అతికించారు. దాంతో పూజను దొంగ చాటుగా తన స్వంత ఊరు కర్ణాటక లోని రాయచూర్ లో ఒక హాస్టల్ కు పంపించాడు. రోజులు గడిచిపోతున్నాయి. ఎంతో మంది పిల్లల కిడ్నాప్ కేసులను సాల్వ్ చేసిన రాజేంద్ర ” గర్ల్-166 “కేసు లో ఫెయిల్ అయ్యానని బాధతోనే రిటైర్డ్ అయ్యాడు. కానీ ఎలాగైనా పూజ ను పట్టిస్తానని. తల్లిదండ్రులకు హామీ ఇచ్చి తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు.
కిడ్నాప్ జరిగిన మూడేళ్లకు అంటే 2016 లో డిసౌజా దంపతులకు ఒక పాప పుట్టింది. ఇక్కడితో కేసు మరో టర్న్ తీసుకుంది. పూజను వాళ్ళు కొట్టడం, తిట్టడం స్టార్ట్ చేసారు. ఒకరోజు బాగా తాగివచ్చిన డిసౌజా నువ్వు మా సొంత బిడ్డవు కావు ఎత్తుకొచ్చామని అన్నారు. దాంతో పూజ కు ఎం చేయాలో అర్ధం కాలేదు. ఎలా తప్పించు కోవాలి. తన అసలు తల్లిదండ్రులు ఎవరు అనేది ప్రశ్నార్ధకం గ మిగిలింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే పూజ అసలు తల్లిదండ్రులుండే గిల్బర్ట్ ఏరియా కు అయిదువందల మీటర్ల దూరం లోనే డిసౌజా ఫామిలీ నివాసం ఉంటుంది.

చాల ఏళ్ళు కావడం, ఆమె ఫోటో లు అంటించిన ప్రకటనలు చినిగి పోవడం వలన పూజను ఎవరు గుర్తుపట్టేవారు కాదు. పూజకు ఫ్రీగ తిండిపెట్టడం ఇష్టం లేని డిసౌజా ఆమెను జుహు లోని ఒక సొసైటీ లో బేబీ సిట్టర్ గ పనిలో పెట్టాడు. పూజ పనిచేసే దగ్గర ప్రమీల అనే ఒకావిడాకు ఏదొ అనుమానం వచ్చింది. దాంతో పూజను అన్ని విషయాలు అడిగి తెలుసుకుంది. గూగుల్ లో ఆమె పేరుతో కిడ్నప్ కేసు లు, మిస్సింగ్ కేసు లను సెర్చ్ చేసింది. ఆమె ప్రయత్నం ఫలించింది. పూజ అదృష్టం కలిసి వచ్చింది. ఒక పేపర్ లో వచ్చిన ఫోటో దొరికింది. దాంతో అక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్ లకు ట్రై చేసింది. నాలుగు నెంబర్ లు పనిచేయటం లేదు. చివరిగా ఐదో నెంబర్ కు కాల్ చేసింది. అది రఫీక్ అనే వ్యక్తి ది. అయన పూజ వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాడు.

అయితే ముందు అయన నమ్మలేదు. ఇలాంటి కాల్స్ ఎన్నో వచ్చాయని అన్నాడు. కానీ ఆమె రఫీక్ కు వీడియో కాల్ చేసి పూజను చూపించడం తో నమ్మాడు. రఫీక్ ద్వారా భోస్లే కు ఈ వార్త తెలిసింది. భోస్లే మళ్ళీ రంగం లోకి దిగాడు. పూజ పనిచేసే సొసైటీ లో మరిన్ని వివరాలు తెలుసుకొని డి ఎన్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చాడు. పోలీస్ టీం, తల్లితో సహా పూజ ఇప్పుడుంటున్న ఇంటికి వెళ్ళింది. తల్లి, బిడ్డ తొమ్మిదేళ్ల తర్వాత కలిశారు. బిడ్డను హత్తుకుని బోరున ఏడ్చింది. ఎం జరిగిందో అర్ధం కానీ ఆ చిన్నారి కూడా కంటతడి పెట్టింది. బిడ్డ తప్పిపోయిన బాధలో తండ్రి చనిపోయాడట, తల్లి, మామ మాత్రమే ఉన్నారు. పోలీస్ లు డి సౌజ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. చాల ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గర్ల్ నెంబర్ 166 కేసు కూడా సాల్వ్ అయినందుకు రాజేంద్ర భోస్లే హ్యాపీ. కానీ భోస్లే వంటి పోలీస్ లు ఎంత మంది ఉంటారు. అందుకే అయన సూపర్ కాప్ అయ్యాడు.

What do you think?

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భారత్ దూకుడు.. బ్రిటన్ను దాటేసి..

గమ్యం లేని కాంగ్రెస్ పార్టీ… గట్టెక్కేనా..