in ,

నకిలీ జడ్జిగా మోసాలు.. ఆట కట్టించిన పోలీసులు

నకిలీ జడ్జిగా మోసాలు.. ఆట కట్టించిన పోలీసులు

ఓ వ్యక్తి తను హై కోర్టు జడ్జి అని చెప్పుకుంటూ ప్రజల డబ్బు దండుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ కేటుగాడి ఆట కట్టించారు.

పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వేములవాడకు చెందిన నామాల నరేందర్(31) అనే వ్యక్తి డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ కు వచ్చాడు. కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాందించాలనే ఆశతో దొంగతనాలు మొదలు పెట్టాడు. ఇతనిపై 2014- 2016 సంవత్సరాల్లో హైదరాబాద్, కరీంనగర్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు కేసులు కూడా నమోదయ్యాయి. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. 2017లో నరేందర్ పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.

అయితే ఆ తర్వాత కంప్లీట్ గా రూట్ మార్చిన నరేందర్ ఖమ్మం నగరానికి తన మకాం మార్చాడు. ఏకంగా అక్కడ తను హై కోర్టు జడ్జి అని చెప్పుకుంటూ మోసాలు మొదలు పెట్టాడు. జనాలను నమ్మించడానికి జమ్మూకశ్మీర్ ఆర్మీలో పని చేసిన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిని గన్ మె‌న్‌గా కూడా నియమించుకున్నాడు. ఇద్దరూ కలిసి భూ సమస్యలు పరిష్కరిస్తానంటూ చాలా మంది దగ్గర డబ్బులు డండుకున్నాడు.

ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ కు చెందిన సోమిరెడ్డి అనే వ్యక్తి భూ వివాదాన్ని పరిష్కరిస్తానని మాయమాటలు చెప్పి అతడి నుంచి రూ.10 లక్షలు తీసుకున్నాడు. అయితే ఎన్ని రోజులు గడిచినా భూ సమస్య తీరకపోవడంతో సోమిరెడ్డి మోసపోయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారించి నరేందర్ నకిలీ జడ్జిగా చలామణి అవుతూ మోసగిస్తున్నట్లు తెలుసుకున్నారు.

వెంటనే నరేందర్ ను, అతని బాడీ గార్డుగా నటిస్తున్న మధుసూదన్ రెడ్డి ని అదుపులోకి తీసుకుని, వారి నుంచి ఒక తుపాకీ, 5 బుల్లెట్లు, ఒక కారు, ఒక మొబైల్, కొంత డబ్బు, నకిలీ విజిటింగ్ కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

What do you think?

పెళ్ళికి నిరాకరించిందని హతమార్చిన ప్రియుడు

లాటరీ రూపంలో అదృష్టం! ప్రతి నెలా రూ.5.5 లక్షలు