లాటరీ రూపంలో అదృష్టం! ప్రతి నెలా రూ.5.5 లక్షలు
ఓ వ్యక్తికి లాటరీ తగిలింది. ఆ లాటరీ ద్వారా ప్రతి నెలా రూ.5 లక్షలు పొందే అదృష్టం పట్టింది.
విషయం ఏంటంటే యూపీకి చెందిన మొహమ్మద్ ఆదిల్ ఖాన్ కొంతకాలంగా దుబాయ్ లోని ఒక రియల్ఎస్టేట్ సంస్థలో ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు.
అయితే ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ‘ఫాస్ట్ 5′(FAST 5) అనే పేరుతో లాటరీ తీసింది. ఆ మెగా ప్రైజ్ మనీ డ్రాలో ఆదిల్ ఖాన్ మొదటి విజేతగా నిలిచాడు. ఈ విషయాన్ని గురువారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో వెల్లడించారు. ఈ ప్రైజ్ మనీ ద్వారా అతనికి విజేతకు నెలకు 25,000 దిర్హమ్లు అంటే నెలకు రూ.5,59,822 చొప్పున 25 ఏళ్లపాటు అందుతాయని తెలిపారు.
మరో వైపు విజేతగా నిలిచిన ఆదిల్ ఖాన్ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. “నేను చాలా కష్టపడుతున్నాను. నా అన్న కరోనా సమయంలో చనిపోయాడు. అతని కుటుంబాన్ని కూడా నేను పోషిస్తున్నాను. వృద్దాప్యంలో ఉన్న నా తల్లిదండ్రుల్ని, నా భార్య పిల్లల్ని నేనే పోషిస్తున్నాను. ఈ సమయంలో ఇలా లాటరీ రావడం ఎంతో సంతోషంగా ఉంది.” అని ఆదిల్ ఖాన్ తన ఆనందాన్ని పంచుకున్నాడు.