in ,

మానవ బాంబునంటూ బ్యాంక్ లో ఓ వ్యక్తి హల్ చల్!

మానవ బాంబునంటూ బ్యాంక్ లో ఓ వ్యక్తి హల్ చల్!

 

ఓ వ్యక్తి తను మానవ బాంబునని బెదిరిస్తూ రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ షాపూర్ నగర్‌లోని ఆదర్శ బ్యాంక్ వద్ద చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ షాపూర్ నగర్‌లోని ఆదర్శ బ్యాంక్ లోకి శివాజీ అనే వ్యక్తి మానవ బాంబునంటూ ప్రవేశించాడు. బాడీ మొత్తానికి ఆత్మహుతి బాంబర్‌లో సెటప్ చేసుకుని, తనకు రూ.2 లక్షలు ఇవ్వాలని లేదంటే బ్యాంక్‌ను పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో ఆ వ్యక్తి బాడీకి ఉన్న బాంబు సెటప్‌ను చూసి భయాందోళనలకు గురైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం అతన్ని పోలీస్ స్టేషన్ కి తరలించారు.

కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

What do you think?

“ఐశ్వర్యా నిన్ను నేను అర్థం చేసుకున్నాను” – రష్మిక

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం!