in ,

డబ్బు ఆశ చూపించి వివాహితను నగ్నంగా వీడియో తీశాడు.

డబ్బు ఆశ చూపించి వివాహితను నగ్నంగా వీడియో తీశాడు.

ఓ వ్యక్తి వివాహితకు డబ్బు ఆశ చూపించి నగ్నం వీడియో తీశాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నంలోని దిల్ సుక్ నగర్ కు చెందిన ఓ 26 ఏళ్ల వివాహిత వివాహ వేడుకలకు ఏర్పాట్లు చేస్తుంటుంది. అయితే నాలుగేళ్ల క్రితం ఆమెకు బోనాల చెన్నకేశవ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
కాగా నెల క్రితం చెన్నకేశవ ఫోన్ చేసి, తనకు తెలిసిన ఓ వెబ్సైట్ ఉందని, ముఖానికి స్కార్ఫ్ ధరించి నీలిచిత్రం (బ్లూ ఫిల్మ్) లో నటిస్తే రూ.10 లక్షలు ఇస్తారని చెప్పాడు.

అప్పటికే ఆర్థిక అవసరాలతో ఇబ్బంది పడుతున్న ఆమె అతడి మాటలు నమ్మి, అతను చెప్పినట్టు చెయ్యడానికి ఒప్పుకుంది. ఈ క్రమంలో చెన్నకేశవ ఆమెను పంజాగుట్టలోని ఓ హోటల్ గదికి పిలిచి మద్యం తాగాలని చెప్పాడు. కానీ ఆమె దానికి నిరాకరించడంతో మరో డ్రింక్లో మద్యం కలిపి తాగించాడు. అనంతరం ఆమె మత్తులోకి జారుకున్నాక చెన్నకేశవ ఆమెను నగ్నంగా చిత్రీకరించాడు.

కొన్ని రోజుల తరువాత ఆమెకు ఫోన్ చేసి, లక్ష రూపాయలు ఇవ్వాలని, లేదంటే నగ్న వీడియోలు వెబ్సైట్లో పెడతానని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఈ బెదిరింపులు రోజు రోజుకు పెరగడంతో ఈనెల 2న ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పొలీసులు చెన్నకేశవపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

What do you think?

వచ్చే నెలలో భారీగా పెరగనున్న ఉల్లి ధర!

తెలంగాణా గాయకుడు గద్దర్ ఇక లేరు