in

వచ్చే నెలలో భారీగా పెరగనున్న ఉల్లి ధర!

వచ్చే నెలలో భారీగా పెరగనున్న ఉల్లి ధర!

ఇప్పటికే టమాటాల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఉల్లి కూడా టమాటా భాటే పట్టనుంది.

ఉల్లి ధర సెప్టెంబర్‌ నాటికి భారీగా పెరిగే అవకాశం ఉందని ‘క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌’ నివేదికలో పేర్కొంది. రబీ ఉల్లి నిల్వలు ఆగస్టు చివరికే అడుగంటే పరిస్థితులు ఉన్నాయన్న క్రిసిల్, దీంతో సెప్టెంబరు నాటికి సరఫరాలు తగ్గి, ధరలు పెరగొచ్చని విశ్లేషించింది. అక్టోబరు నుంచి ఖరీఫ్‌ పంట లభ్యత పెరిగితే, ఉల్లి ధరలు మళ్లీ తగ్గుముఖం పడతాయని తన నివేదికలో పేర్కొంది. కాగా వచ్చే నెల కల్లా కిలో ఉల్లి దర రూ.60-70 వరకు చేరొచ్చని క్రిసిల్ అభిప్రాయపడింది.

What do you think?

చైనా కీలక నిర్ణయం! ఇక అక్కడ ఇంటర్నెట్ వాడలేరు.

డబ్బు ఆశ చూపించి వివాహితను నగ్నంగా వీడియో తీశాడు.