in

చైనా కీలక నిర్ణయం! ఇక అక్కడ ఇంటర్నెట్ వాడలేరు.

చైనా కీలక నిర్ణయం! ఇక అక్కడ ఇంటర్నెట్ వాడలేరు.

చైనా ఇంటర్నెట్ వినియోగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి రాత్రి పూట ఇంటర్నెట్ ను బంద్ చేసింది.

ఇంటర్నెట్ వచ్చిన తరువాత ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండడం, నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒకటి చూస్తూ గడపడం సాధారణం అయిపోయింది. పెద్దలపై ఈ ఇంటర్నెట్ ప్రభావం ఎలా ఉన్నా, పిల్లలికి మాత్రం ఇది ఒక వ్యసనం అయిపోయింది. చదువు కూడా పక్కన పెట్టి పిల్లలు నిత్యం ఫోన్ లు పట్టుకుని తిరుగుతున్నారు. దీని వల్ల వారి ఏకాగ్రత బాగా దెబ్బతింటుంది. దీంతో ఈ ఇంటర్నెట్ వినియోగానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో చైనా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక నుంచి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇంటర్నెట్‌ను పూర్తిగా బంద్ ప్రకటించింది. 8 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు వారు ఒక గంట సమయం మాత్రమే ఫోన్ వినియోగించాలని చెప్పింది. 16 నుంచి 18 ఏళ్ల వారు రోజుకి రెండు గంటలు మాత్రమే ఫోన్ వాడాలని సూచించింది. అయితే శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పడే యాప్ లకు ఈ నిబంధలు వర్తించవని చైనా ప్రభుత్వం తెలిపింది.

What do you think?

ఉల్లి ఘాటుకి రిటర్న్ అయిన ఫ్లైట్..

వచ్చే నెలలో భారీగా పెరగనున్న ఉల్లి ధర!