in

డేనియల్ కూపర్‌ ఏమయ్యాడు? చనిపోయాడా? మాయమయ్యాడా?

డేనియల్ కూపర్‌ ఏమయ్యాడు? చనిపోయాడా? మాయమయ్యాడా?

నవంబర్ 24, 1971

డేనియల్ కూపర్‌ అనే ఓ వ్యక్తి 305 ఫ్లైట్‌లో పోర్ట్‌ల్యాండ్, ఒరెగాన్ నుండి సియాటిల్, వాషింగ్టన్‌కు నార్త్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో $20 వన్-వే టిక్కెట్‌ను కొనుగోలు చేసి ఫ్లైట్ ఎక్కాడు. కూపర్ వయసు సుమారు 40 ఏళ్లు ఉండొచ్చు. అతను బిజినెస్ సూట్, ఓవర్ కోట్ లో బ్రౌన్ షూస్ వేసుకుని తెల్లటి చొక్కా, నలుపు టై వేసుకుని ఉన్నాడు. కూపర్ తనతో ఒక బ్రీఫ్‌కేస్, ఒక బ్రౌన్ పేపర్ బ్యాగ్‌ని తీసుకెళ్లాడు.

ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు కూపర్ ఫ్లైట్ అటెండెంట్ నుండి ఒక బార్బన్, సోడా కూడా ఆర్డర్ ఇచ్చాడు.
అయితే ఫ్లైట్ టేకాఫ్ అయిన కొంత సమయం తరువాత కూపర్ ఫ్లైట్ అటెండెంట్‌ ని పిలిచి ఒక నోట్‌ ఇచ్చాడు. మొదట, ఆమె దానిని అంతగా పట్టించుకోకుండా తన జేబులో పెట్టుకుంది. కానీ కూపర్ ఆమెను మళ్ళీ పిలిచి “మిస్, మీరు ఆ నోటును చూడండి. నా దగ్గర బాంబు ఉంది.” అని చెప్పాడు. ఆ మాటకు ఆ అటెండెంట్ స్పందించే లోపే తన పక్కన కూర్చోమని అడిగాడు. తను చెప్పినట్టే తన దగ్గర బాంబ్ ఉందని తెలియడానికి బ్రీఫ్‌కేస్‌ని తెరిచి, దాంట్లో ఉన్న బాంబును చూపించాడు.

కూపర్ ఫ్లైట్ అటెండెంట్‌కి అతను చెప్పేదంతా రాయమని, ఆ నోట్ ను కెప్టెన్ వద్దకు తీసుకెళ్లమని చెప్పాడు. ఆ నోట్‌లో “నాకు సాయంత్రం 5 గంటలలోపు $200,000 కావాలి, అవన్నీ $20 నోట్లే అయ్యుండాలి, వాటిని నాప్‌కిన్‌లో పెట్టండి. నాకు రెండు బ్యాక్ పారాషూట్‌లు, రెండు ఫ్రంట్ పారాషూట్‌లు కావాలి. మనం దిగినప్పుడు, ఫ్యూయల్ నింపడానికి సిద్ధంగా ఉన్న ఫ్యూయల్ ట్రక్ కావాలి. నేను చెప్పినట్టు చేయండి. లేదంటే ఎవరూ ప్రాణాలతో ఉండరు.” అని ఉంది.

ఎఫ్బీఐ (FBI) ఏజెంట్లు సీటెల్-ఏరియా బ్యాంకుల నుండి డబ్బును సేకరిస్తే, సీటెల్ పోలీసులు స్థానిక స్కైడైవింగ్ స్కూల్ నుండి పారాషూట్‌లు తీసుకొచ్చారు. అలా కూపర్ అడిగినట్లే అన్నీ ఏర్పాటు చేశారు.

కూపర్ తన డిమాండ్లు పూర్తయిన తరువాత మాటిచ్చినట్టే ప్రయాణికుల్ని, కొంతమంది సిబ్బందిని విమానం నుండి వెల్లిపోనిచ్చాడు. ఆ తరువాత కూపర్ ఫ్లైట్ లో ఫ్యూయల్ ని రీ ఫిల్ చేయించి మిగిలిన సిబ్బందికి ఫ్లైట్ ను 10,000 అడుగుల దిగువలో పోనిస్తూ మెక్సికో సిటీకి తీసుకు వెళ్ళమని చెప్పాడు. ఆ సమయంలో కూపర్ ఒక జత వ్రాప్‌రౌండ్ సన్ గ్లాసెస్ వేసుకుని ఉన్నాడు. ఆ స్కెచ్ (sketch) తరవాత విచారణలో బాగా పాపులర్ అయ్యింది.

అయితే డేనియల్ కూపర్ ఆ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి 8 గంటల తర్వాత ఎక్కడో సీటెల్ – రెనో, నెవాడా మధ్యలో రెండు పారాచూట్‌లతో, డబ్బుతో ఫ్లైట్ వెనుక డోర్ నుండి దూకేసాడు. ఆ దూకడం దూకడం కూపర్ మళ్లీ కనిపించలేదు.

అయితే అతను ఫ్లైట్ నుంచి బయటకు దూకిన తరువాత యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడని కొందరు అన్నప్పటికీ, దాన్ని నిజం అని నిరూపించడానికి ఏ ఆధారాలు దొరకలేదు.

అతని కోసం 45 సంవత్సరాలకు పైగా ఇన్వెస్టిగేషన్ జరిగింది, కానీ పోలీసులకి, ఎఫ్బీఐకి అతను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ తర్వాత ఏమయ్యాడు? అన్న విషయాలు తెలియలేదు. ఇప్పటికీ ఇది యూఎస్ చరిత్రలో సాల్వ్ కానీ మిస్టరీ లానే మిగిలిపోయింది.

What do you think?

10 Points
Upvote Downvote

అమెరికాలో డిప్రెషన్ తో రోడ్డుపై పడిన తెలంగాణా వాసి

‘ప్రభాస్ తో నాకు పోటీ ఏంటి?’ – వివేక్ అగ్నిహోత్రి