in

అమెరికాలో డిప్రెషన్ తో రోడ్డుపై పడిన తెలంగాణా వాసి

అమెరికాలో డిప్రెషన్ తో రోడ్డుపై పడిన తెలంగాణా వాసి

తన కూతురు అన్ని పోగొట్టుకుని అమెరికాలో డిప్రెషన్ తో, ఆకలితో బాధ పడుతుందని ఓ తల్లి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ (External affairs minister) కి లెటర్ రాసింది. దయచేసి తన కూతుర్ని ఎలాగైన తిరిగి ఇంటికి తీసుకురావాలని కోరింది.

వివరాల్లోకి వెళ్తే 2021, ఆగస్ట్ లో హైదరబాద్ కు చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ ట్రైన్ యూనివర్సిటీ (trine University) లో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అమెరికా వెళ్ళింది. అలా మిన్హాజ్ అమెరికా వెళ్ళినప్పటి నుండి ఈ ఏడాది వరకు రోజూ కుటుంబ సభ్యులతో టచ్ లో ఉంటూ వచ్చిన ఆమె గత రెండు నెలల నుంచి కాల్ చేయడం మానేసింది. ఎవరితోనూ టచ్ లో ఉండలేదు.

అయితే ఇటీవల మిన్హాజ్ నుంచి ఎవరో అన్ని దొంగలించారని, దీంతో ఆమె రోడ్డు మీద పడి, డిప్రెషన్ తో, ఆకలితో బాధ పడుతుందని అమెరికాలో హైదరాబాద్ కు చెందిన మరో ఇద్దరి ద్వారా మిన్హాజ్ కుటుంబ సభ్యులకు తెలిసింది.

దీంతో మిన్హాజ్ తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమా తన కూతుర్ని తిరిగి హైదరాబాద్ కు తీసుకు రావాలని కోరుతూ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయ్ శంకర్ (S.jaishankar) కి లెటర్ రాసింది.

“మా కోతురు సయ్యదా లులు మిన్హాజ్ జైదీ 2021 ఆగస్టులో ట్రైన్ యూనివర్శిటీలో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అమెరికా వెళ్ళింది. గత రెండు నెలల నుండి తన నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఇటీవలి హైదరాబాద్ కు చెందిన ఇద్దరి ద్వారా ఎవరో మా కూతురు నుంచి అన్నీ దొంగలించడంతో అన్నీ పోగొట్టుకుని రోడ్డు పై పడి, డిప్రెషన్ తో, ఆకలితో బాధ పడుతుందని తెలిసింది. దయచేసి మా కూతుర్ని హైదరాబాద్ కు తిరిగి తీసుకురండి.” అంటూ మిన్హాజ్ తల్లి ఆ లెటర్ లో పేర్కొంది.

What do you think?

అదరగొట్టే ఐదు అద్భుతమైన అనిమేలు (top 5 Animes)

డేనియల్ కూపర్‌ ఏమయ్యాడు? చనిపోయాడా? మాయమయ్యాడా?