in ,

అదరగొట్టే ఐదు అద్భుతమైన అనిమేలు (top 5 Animes)

అదరగొట్టే ఐదు అద్భుతమైన అనిమేలు (top 5 Animes)

ఈ మధ్యకాలంలో సిరీస్లు చూడడం, అందులోనూ జాపనీస్ అనిమే సిరీస్లు (Japanese Anime) చూడడం భారత్ లో ఒక ట్రెండ్ గా మారింది. కానీ ఈ ట్రెండ్ లో కొత్తగా కలవాలని అనుకునే వారు ఏ సిరీస్ చూడలో, ఏది బావుంటుందో తెలీక తికమక పడుతుంటారు. అలాంటి వారి కోసం ఐదు మంచి అనిమే (Animes) లను ఈ ఆర్టికల్ లో రికమెండ్ చేస్తున్నాము. చూసి ఆనందించండి.

1. వన్ పీస్ (one piece)

గోల్.డి.రోజర్ (gol.d.roger) కింగ్ ఆఫ్ ది పైరేట్స్ (king of the pirates) చనిపోతూ తన ట్రెజర్ (treasure) గురించి లోకానికి చెప్తాడు. ఆ ట్రెజర్ ను సొంతం చేసుకోడానికి బలవంతులైన పైరేట్స్ మధ్య రేస్ మొదలవుతుంది. ఆ రేస్ లో పైరేట్ కింగ్ అవ్వడానికి 17 ఏళ్ల లూఫీ (luffy) కూడా జాయిన్ అవుతాడు.
ఇప్పటి వరకు వచ్చిన అనిమే లలో ఇది ఒక అద్భుతమైన అనిమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే దీనిలోని ప్రపంచానికి, పాత్రలకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకమైన బ్యాక్ స్టోరీ ఉంటుంది. లూఫీ (luffy) కారెక్టర్ వీటన్నిటి కంటే ప్రత్యేకంగా ఉంటుంది.

అందుకే అనిమేని రుచి చూసిన ప్రతి ఒక్కరూ ఇది తప్పని సరిగా చూడాల్సిన అనిమే సీరీస్.

2. మాబ్ సైకో 100 (mob psycho 100)

ఇది ‘కాగేయామా షిగయో’ అనే ఒక మామూలు మిడిల్ స్కూలర్ కథ. ఈ అనిమేలో ‘కాగేయామా’ (మెయిన్ కారెక్టర్) పాత్ర ఎక్కువ శాతం అనిమే లలో పాత్రల కంటే ప్రత్యేకంగా ఉంటుంది. అది ఈ అనిమేకి ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇక కథ సాగే విధానం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

అందుకే అనిమే లోకి అడుగు పెట్టిన వారు తప్పక చూడాల్సిన అనిమే లలో ఇది ఒకటి.

3. హంటర్ × హంటర్ (hunter × hunter)

ఈ హంటర్ × హంటర్ లోని ప్రపంచం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులోని ప్రతి ఒక్క పాత్రకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ పాత్రలలో ప్రతి ఒక్కరికి ఆసక్తి కలిగించే బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఈ అనిమే లో మెయిన్ కారెక్టర్ అయిన ‘గాన్’ పరిస్థితులను హాండిల్ చేసే విధానం, వాటికి తను రియాక్ట్ అయ్యే విధానం చాలా బావుంటుంది. ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది.

4. డెత్ నోట్ (death note)

ఇందులోని ప్రధాన పాత్ర ‘లైట్ యగామి’కి మనిషి చావును నిర్ణయించగల బుక్ (death note) దొరుకుతుంది. ఆ తర్వాత నుంచి లైట్ తనే దేవుడ్ని అన్నట్టుగా తప్పు చేసిన వారిని, తనకు ఎదురు వచ్చిన వారిని చంపుతుంటాడు. లైట్ ను పట్టుకోడానికి ‘ఎల్ ‘ (L) అనే డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. అలా ‘లైట్’కు ‘ఎల్’ కి మధ్య క్యాట్ అండ్ మౌస్ (cat and mouse) గేమ్ స్టార్ట్ అవుతుంది.

ఈ సీరీస్ లో లైట్ వేసే ఎత్తులు, ఎల్ వాటిని ఎదుర్కోడానికి చేసే ప్రయత్నాలు సీరీస్ ను బింజ్ వాచ్ చేసేలా చేస్తాయి.

5. అటాక్ అన్ టైటాన్ (Attack on Titan)

మనుషుల్ని తినే టైటాన్స్ మొదటి సారి 100 ఏళ్ల కిందట వచ్చాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి మనుషులు వారి చుట్టూ బ్యారియర్స్ ఏర్పాటు చేసుకుని ఆ బ్యారియర్స్ లో టైటాన్స్ రాకుండా నివసిస్తుంటారు. కానీ ఒక సారి ఒక భారీ టైటాన్ ఆ బ్యారియర్స్ ను డిస్ట్రాయ్ చేయడంతో మనుషులు మళ్ళీ ప్రమాదంలో పడతారు. ఇక వాటిని మనుషులు ఎలా ఎదుర్కొన్నారు? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్న అంశాలతో ఈ సీరీస్ సాగుతుంది.

దీనిలో ఈ ప్రత్యేకమైన కథ అందరికీ నచ్చుతుంది. అందుకే అనిమే లోకి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన అనిమేలలో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు.

What do you think?

పోలీసులను చూసి రూ. 5000 మింగేసిన రెవెన్యూ అధికారి

అమెరికాలో డిప్రెషన్ తో రోడ్డుపై పడిన తెలంగాణా వాసి