in

పోలీసులను చూసి రూ. 5000 మింగేసిన రెవెన్యూ అధికారి

పోలీసులను చూసి రూ. 5000 మింగేసిన రెవెన్యూ అధికారి

ఒక రెవెన్యూ

అధికారి రూ. 5000 మింగేశాడు. లంచం తీసుకుంటూ దొరికిపోయి ఈ పనికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్‌లోని కట్నీలో ఒక రెవెన్యూ శాఖ పట్వారీ గజేంద్ర సింగ్‌ ప్రతి పనికి లంచాలు తీసుకుంటూ ప్రజల నుంచి డబ్బు దండు కోడానికి బాగా అలవాటు పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ సాహు, గజేంద్ర సింగ్‌ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోడానికి ఉచ్చు పన్నారు. ఈ ప్లాన్ లో భాగంగానే ఎస్పీఈ ఎస్పీ సంజయ్ సాహు తన ప్రైవేట్ కార్యాలయంలో రూ. 5,000 గజేంద్ర సింగ్‌ కు లంచంగా ఇవ్వగా అతను అంగీకరించాడు. ఆ మరుక్షణమే ఎస్పీఈ బృందం అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోడానికి అక్కడ ఎంట్రీ ఇచ్చింది. వారిని గమనించిన పట్వారీ గజేంద్ర సింగ్‌ ఆ రూ. 5000 మింగేసే ప్రయత్నం చేస్తూ దొరికిపోయాడు.

కాగా ఈ వీడియోను చిత్రీకరించి ఆన్లైన్ లో పోస్ట్ చేయడంతో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

What do you think?

మణిపూర్ ఘటనలో 14 మంది నిందితులు

అదరగొట్టే ఐదు అద్భుతమైన అనిమేలు (top 5 Animes)