in

వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణికుడి భోజనంలో బొద్దింక

వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణికుడి భోజనంలో బొద్దింక

వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించిన ఓ ప్రయాణికుడి భోజనంలో బొద్దింక వచ్చింది. ఈ విషయాన్ని ఆ ప్రయాణికుడు అధికారులకు తెలియ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

వివరాల్లోకి వెళ్తే జూలై 24న భోపాల్‌లోని రాణి కమలాపతి స్టేషన్ నుండి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడి భోజనంలో బొద్దింక వచ్చింది. దీంతో ఆవేదనకు గురైన ఆ ప్రయాణికుడు తన ట్విట్టర్ లో ఈ ఘటనకు సంభందించిన ఫోటోలను పంచుకుంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అయితే ఈ ఘటన పై వెంటనే స్పందించిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఇలా జరిగినందుకు క్షమాపణలు కోరింది. భోజనం ప్రొవైడ్ చేసిన సంస్థకు భోజనం సర్వ్ చేసే సమయంలో ప్రికాషన్స్ తీసుకోమని వార్నింగ్ ఇచ్చినట్లు, ఆ సంస్థకు భారీ ఫైన్ కూడా విధించినట్లు తెలిపింది.

మరో వైపు ఇండియన్ రైల్వేస్ కూడా @Railwayseva హ్యాండిల్ ద్వారా స్పందిస్తూ ప్రయాణికుడిని క్షామాణలు కోరింది. ఇలాంటి ఘటనలు మరో సారి జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది.

What do you think?

‘ప్రభాస్ తో నాకు పోటీ ఏంటి?’ – వివేక్ అగ్నిహోత్రి

ఐఫోన్ 14 కోసం 8 ఏళ్ల బిడ్డను అమ్ముకున్న జంట