‘ప్రాజెక్ట్ శక్తి’ అతి చిన్న వయసులోనే ఎవరెస్టును అధిరోహించిన తెలంగాణ అమ్మాయి
బచేంద్రిపాల్ ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ. 1984లో ఎవరెస్ట్ను అధిరోహించి, మన త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసింది. ఈమె స్పూర్తితో…………
అరుణిమా సిన్హా ..యూపీ కి చెందిన వాలీబాల్ ప్లేయర్. అనుకోని దుర్ఘటనలో తన కాలు పోగొట్టుకుని అవిటి అయింది, అయినా ఆమె సంకల్పానికి అవిటితనం అడ్డుకాలేదు, కఠోర శ్రమతో కృషి చేసి, ఎన్నో హేళనలను అధిగమించి తన సంకల్పబలంతో ఎవరెస్ట్ ను అధిరోహించింది.
పియాలి బసక్ .. వెస్ట్ బెంగాల్ కు చెందిన మహిళ ఆమె అందరికీ విభిన్నంగా ఆక్సిజన్ సిలిండర్ లేకుండానే ఎవరెస్టును అధిరోహించి, స్త్రీ శక్తిని నిరూపించింది.
మలావత్ పూర్ణ .. అతి చిన్న వయసులోనే ఎవరెస్టును అధిరోహించిన తెలంగాణ అమ్మాయి. మలావత్ పూర్ణ పదమూడేళ్ళ వయసులో ఎవరెస్ట్ అధిరోహించి పేరుతెచ్చుకుంది. ఆ విజయం ఇచ్చిన స్ఫూర్తితో మరో ఏడు పర్వతారోహణలు కూడా చేసింది. ఈమె జీవిత కథ ఆధారంగా పూర్ణ పేరుతో బాలీవుడ్లో సినిమా కూడా తీశారు. ఆర్థిక ఇబ్బందులతో ఆడపిల్లల చదువు ఆగిపోకూడదని ‘ప్రాజెక్ట్ శక్తి’ ని ప్రారంభించింది. ఆమెకు చేయూతగా కావ్య రెడ్డి అనే మరో మహిళ కూడా తోడయ్యారు. వారు వారి లక్ష్యాన్ని సాధించడంలో సఫలం అవ్వాలని ఆశిద్దాం.
గట్టి సంకల్పంతో తలుచుకుంటే అరుణిమను తన లక్ష్యాన్ని సాధించడంలో అవిటితనం ఆపలేకపోయింది. పూర్ణా ను వయసు అడ్డుకోలేకపోయింది.
ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రతి రంగంలోనూ స్త్రీ తన శక్తిని చాటుకుంటోంది. నీలో ఉన్న శక్తికి నీ సంకల్పం తోడైతే కచ్చితంగా అనుకున్నది సాధించగలరు.