in ,

అవిశ్రాంత జనసేన సేవకుడు… బొమ్మిడి నాయకర్

అవిశ్రాంత జనసేన సేవకుడు… బొమ్మిడి నాయకర్

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం: గడిచిన ఎన్నికల్లో ఇక్కడ ప్రధానంగా వై ఎస్ ఆర్ సీపీ అభ్యర్థి ముందునూరి ప్రసాద్ రాజు గారు ఇక్కడ 2019 ఎన్నికల్లో గెలిచారు. ఆయనకు 41శాతం ఓట్లు పడటం జరిగింది. ఇక రెండోవ స్థానంలో జనసేన పార్టీ బొమ్మిడి నాయకర్ గారు ఈయనకు 36 శాతం ఓట్లు అక్కడ ప్రజలు ఇవ్వటం జరిగింది. మూడవ స్థానంలో మాధవ నాయుడు గారు టీ డీ పీ నుండి అభ్యర్థిగా నిలబడి వోడిపోవటం జరిగింది, ఇరవైశాతం ఓట్లు ప్రజలు ఇచ్చారు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజక వర్గానికి ఈ 2024 ఎన్నికల్లో ఒక విశేషముంది. జనసేన పార్టీ నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం రెండు ప్రధాన కులాలను కాదని మరొక బి సిలో ఒక బలమైన కులానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎం ఎల్ ఏ గా యువకుడైనటువంటి బొమ్మిడి నాయకర్ని అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నిలబెట్టడం జరిగింది.

తీరా ప్రాంతం, లోక్ సభ నియోజకవర్గం కేంద్రమైన నరసాపురంలో కాపు సామాజిక వర్గ ఓట్లు నలభై శాతం ఉండగా బిసి,ఎస్ సి లతో ఇతర కులాలు కలుపుకొని అరవై శాతం ఓట్లన్నాయి. ఈ నియోజకవర్గంలో బి సి ల అభ్యర్ధే నియోజక వర్గ విజయాన్ని నిర్ణయించనున్నారు.

బొమ్మిడి నాయకర్కు 2024 ఎన్నికల్లో కలిసి వచ్చే అంశాలు నరసాపురం నియోజక వర్గంలో ప్రజలందరూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. ప్రజలలో ఒక మార్పు కొత్తదనం తీసుకురావడం కోసం జనసేన పార్టీ తరుపున బొమ్మిడి నాయకర్ ప్రజల మధ్య పని చేస్తున్నారు. చెరువులన్నీ దళారీల చేతిలో ఉన్నాయని అందుకే 217 జీవో ద్వారా వేలం వేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. అయితే దీనిపై మత్స్యకారుల నుండి తీవ్ర ఆందోళన వ్యక్తంమౌతంది.

మత్స్య కారుల జీవన ప్రమాణాలు పెంపొందింప చేయడం, వృత్తి పరమైన ఉపాధి భరోసా కల్పించడం, ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న మత్స్యకార డిమాండ్ల సాధన కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ప్రభుత్వంలోని పెద్దలకు మతయకారుల సమస్యలపై దృష్టి పెట్టే సమయం,ఆలోచన రెండూ లేని నేపథ్యంలో మత్స్యకారుల పక్షాన పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నట్లుగా జనసేన పార్టీ వెల్లడించింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా పోటెత్తిన గోదావరి వరదల వలన మత్స్య కారులు,వారి గ్రామాలు. తీవ్రంగా నష్టపోయాయి. దీనికి బొమ్మిడి నాయకర్ అన్ని గ్రామాలకు తిరిగి దుప్పట్లు పంచి పెట్టారు. సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నడుస్తున్న ప్రభుత్వం చేయలేని అనేక సామాజిక కార్యక్రమాల్లో జనసేన పార్టీ తరపున బొమ్మిడి నాయకర్ ప్రజల మధ్య పవన్ కళ్యాణ్ ను సి ఎం గా చూడటమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు.

What do you think?

వినోదాన్ని పంచే టాప్ 5 జీ-5 సినిమాలు #పార్ట్ 1…

2024 ఎన్నికల వేళ పార్టీలు జిల్లాలలో వాటి బలా బలాలు