in ,

బ్రిటన్ మూడవ మహిళా ప్రధానిగా లిజ్ ట్రస్

బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ అంతర్గత ఎన్నికల ఫలితాలలో లిజ్ ట్రస్ , రిషి సునక్ పై ఇంచుమించు ఇరవై ఒక్క వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈమె బ్రిటన్కు మూడవ మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు.

ఈమె తండ్రి ఒక ప్రొఫెసర్, తల్లి ఒక నర్స్, చిన్నప్పుడే ఆమె తల్లి తో కలిసి అణ్వాయుధ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడిని తీవ్రంగా ఖండించారు. ఈమె ఆక్స్ఫర్డ్లో తత్వ, రాజకీయ, ఆర్థిక శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఈమె చదువు పూర్తయ్యాక ఎకౌంటెంట్ గా కూడా పనిచేశారు.

ఈమె కన్జర్వేటివ్ పార్టీలో చేరాక రెండు వైఫల్యాలను చవిచూశారు, తర్వాత ఆగ్నేయ లండన్లోని గ్రీన్విచ్ నుంచి పోటీ చేసి కౌన్సిలర్గా విజయం సాధించారు. ఈమె 2012లో విద్యాశాఖ మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్ లోని అత్యంత కీలక పదవి అయిన విదేశాంగ శాఖ మంత్రి పదవి కూడా చేపట్టారు. అధిక ధరలను తట్టుకునేలా పన్నుల్లో రాయితీలను ఇస్తానని విస్తృత ప్రచారం చేశారు.

భారత్లో పలుమార్లు పర్యటించారు. లిజ్ నాయకత్వంలో మన భారత్, బ్రిటన్ల బంధం మరింత బలపడాలని, మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

What do you think?

బుర్ర కథ లోని సందర్భోచిత కథనం.. రచయితల కోసం

భయం కలిగించే ఆకలి తీరని బాలుడి భయంకరమైన కథ