in ,

భయం కలిగించే ఆకలి తీరని బాలుడి భయంకరమైన కథ

ఆకలి తీరని బాలుడు

 

10 మంది తినే ఆహారాన్ని తిన్నాకా కూడా ఆకలి తీరని 14 ఏళ్ల పిల్లాడి గురించి ఎప్పుడైనా విన్నారా..వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ…అలాంటి ఒక చిన్న పిల్లాడి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1790లో ఫ్రాన్స్కు చెందిన టర్రారె అనే 14 ఏళ్ల బాలుడు విపరీతమైన ఆకలి కలిగి ఉండేవాడట. ఎంత తిన్నా తన ఆకలి తీరకపోవడం,టర్రారె తల్లిదండ్రులకు ఇక తన కడుపు నింపే స్థోమత కూడా లేకపోవడంతో చేసేదేమీ లేక టెర్రారెస్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. రాళ్ళను,మట్టిని,పిల్లులను,కుక్కలను ఇలా తన చేతికి ఏది దొరికితే దాన్ని తింటూ రోడ్లపై తిరుగుతున్న టర్రారె ఫ్రెంచ్ సైనిక దళం వారి కంటబడ్డాడు. తన విపరీతమైన ఆకలితో శరీరం నుండి ఎప్పుడూ ఆవిరులు కక్కుతూ తింటూ ఉండడంతో తన వింతైన శరీరంపై,భీకరమైన ఆకలిపై ఆసక్తి కలిగిన మిలిటరీ వైద్యులు డాక్టర్ కోర్విల్లే,బారన్ పెర్సీలు టర్రారెను తమ వెంట తీసుకువెళ్ళి సైన్యంలో ఒకరిగా చేర్చారు.

 

ఫ్రెంచ్ సైన్యంలో సైనికుడిగా ఉన్న టర్రారెకు రోజుకి 10 మంది తినే ఆహారం ఇచ్చినప్పటికీ తన ఆకలి తీరేది కాదట. కొన్ని సార్లైతే ఈల్ చేపను ఆమాంతంగా మింగేసేవాడట. డాక్టర్లు టర్రారెకు ఇలా ఆకలి ఎందుకు వేస్తుందో అనే విషయం తెలుసుకోవాలని ప్రయత్నించినప్పటికి దాని కారణం తెలుసుకోవడంలో విఫలమయ్యారు. 17 ఏళ్ల వయసులో టర్రారె అమితంగా తిన్నప్పటికీ 45 కేజీల బరువు మాత్రమే ఉండేవాడట.

 

ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తను తినే ఆహారంకు అనువుగా ఎక్కువ ఆహారం తినేటప్పుడు పొట్ట వదులుగా సాగుతూ,బుగ్గలు ఏనుగు చేవుల్లా వెలడుతూ రబ్బర్ శరీరంలా సహయపడేదట. అదేవిధంగా టర్రారెకు ఆహరం జీర్ణించుకోవడంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదట. ఒకానొక సమయంలో జనరల్ డే బీయూహర్నైస్ చిత్రమైన విధంగా రహస్య సమాచారాన్ని సైనికులకు అందివడంలో టర్రారెను ఉపయోగించాడట. కానీ కొన్ని రోజుల తరువాత తను శత్రువులకు దొరికిపోవడంతో ఆ సమాచార చేరవేత అక్కడితో ఆగిపోయింది. శత్రువులు వదిలేయడంతో ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని తిరిగి వచ్చిన టర్రారే తనను మళ్ళీ ఎలాంటి వాటికి ఉపయోగించవద్దని జనరల్ డే బీయూహర్నైస్ని వేడుకున్నాడు.

 

అలా ఫ్రెంచ్ మిలిటరీ హాస్పిటల్కు తిరిగి వచ్చిన టర్రారే డాక్టర్ బారన్ పెర్సీని తనను అందరిలాగా మామూలుగా ఉండేలా చేయమని కోరాడు. టర్రారే కోరిన విధంగానే డాక్టర్ పెర్సీ వైన్ వెనిగర్, పొగాకు మాత్రలు ఇలా తనకు వీలైనంత మేరకు అతనిపై పనిచేస్తుందని భావించిన ప్రతి ఔషధాన్ని ఉపయోగించాడు. కానీ అతనిపై అవి పనిచేయకపోగా మునుపటికంటే ఎక్కువ ఆకలిగా కనిపించాడు. వాళ్ళు పెట్టే ఆహారంతో తృప్తి చెందని టర్రారె ఆసుపత్రిలోని రోగుల నుండి తీసిన రక్తాన్ని తాగుతూ, మార్చురీలోని కొన్ని మృతదేహాలను తింటూ పట్టుబడ్డాడు. 14 నెలల పాప అదృశ్యమైనప్పుడు దాని వెనుక టర్రారే ఉన్నాడని పుకార్లు పుట్టడంతో బారన్ పెర్సీ అతన్ని అక్కడ నుంచి తరిమివేసాడు. అలా తరిమేసిన నాలుగేళ్ల తరువాత 1798లో టెర్రారే టీ.బీతో చనిపోయాడు.

 

బారన్ పెర్సీ టర్రారె శరీర రహస్యాన్ని పోస్టుమోర్టంలో తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అతని శరీరం నుంచి వచ్చే వాసన తట్టుకోలేక మధ్యలోనే ఆపేశారు. ఆ విధంగా టర్రారె అమితమైన ఆకలికి కారణం తెలియకుండానేపోయింది. ఏదేమైనా ప్రతి దాన్ని తిని జీర్ణించుకోగల వ్యక్తిగా టర్రారె చరిత్రలో నిలిచిపోయాడు.

What do you think?

బ్రిటన్ మూడవ మహిళా ప్రధానిగా లిజ్ ట్రస్

భరతమాతను చీరలోనే చూపిస్తారు.కట్టు తోనే ఆకట్టు..