in ,

భరతమాతను చీరలోనే చూపిస్తారు.కట్టు తోనే ఆకట్టు..

కట్టు తోనే ఆకట్టు

 

ఒక వ్యక్తి యొక్క వేషధారణ చూసే, వారి నడవడికను అంచనా వేస్తారు. అటువంటిది స్త్రీ యొక్క వేషధారణ, ఆంచనాలను రెండింతలు చేస్తుంది. మారుతున్న కాలంతో పాటు దుస్తులు, సంప్రదాయాలు కూడా మారుతూ వచ్చాయి. పూర్వం పెళ్లయిన ఆడవాళ్ళు చీరలు తప్ప మరేది ధరించేవారు కాదు, కానీ నేడు చీర తప్ప ఏదైనా సిద్ధమే అంటున్నారు. వారి వస్త్రధారణ విషయం వారి హక్కు గా భావిస్తున్నారు. సమాజం ఏమనుకున్నా పట్టించుకోమంటున్నారు.

 

పరదేశీయులతో పోల్చుకుంటున్నారు. ఎన్ని రంగాలలో ఎదిగిన, ఎంత సమానత్వంతో ముందుకు దూసుకుపోతున్న, వస్త్రధారణ విషయంలో ఎన్నటికీ మగవారితో ఆడవారు సమానం కాలేరు..ఇది ప్రతి స్త్రీ ఒప్పుకుని తీరాల్సిన సత్యము. పాశ్చాత్య మోజులో జాతి మర్యాదను మంట కలపకండి. మన దేశంలో ఎంత నాగరికత పెరుగుతున్న ఎంత అభివృద్ధి చెందుతున్న భరతమాతను మరో చిత్రంలో చూపరు, నిండైన చీరలోనే చూపిస్తారు. దేవతామూర్తుల చిత్రపటాలు కూడా నిండైన దుస్తులలోనే ఉంటాయి.

నిండు తనంలోనే అమ్మ ఉంది , నిండు తనంలోనే దేశ మర్యాద ఉంది, నిండు తనంలోనే పవిత్ర రూపం ఉంది . మీ అభివృద్ధి పదంలో ఎల్లలు దాటి ఎక్కడికైనా వెళ్లండి, కానీ నిండుతనం తో ఉండి మన దేశ మర్యాద ని ఇంకా పెంపొందించండి. కట్టుతోనే అందరినీ ఆకట్టండి.

What do you think?

భయం కలిగించే ఆకలి తీరని బాలుడి భయంకరమైన కథ

స్వతంత్రం తర్వాత నిర్మించబడ్డ అందమైన నిర్మాణాలు