in

B వాల్ట్ అరేబియా సముద్రానికి మార్గమా? పద్మనాభస్వామి ఆలయ సంపదలు, రహస్యాలు

8వ శతాబ్దానికి చెందిన శ్రీ పద్మనాభస్వామి ఆలయం భారతదేశంలోని విష్ణువుకు అంకితం చేయబడిన 108 దేవాలయాలలో ఒకటి. కేరళలోని తిరువనంతపురం లో ఉన్న ఈ ప్రసిద్ధి గాంచిన ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. మార్తాండ వర్మ రాజు కాలంలో ఈ ఆలయం పెద్ద పునర్నిర్మాణానికి నోచుకుంది. భక్తుడైన రాజు మార్తాండ వర్మ ఆలయాన్ని మరియు రాజ్యంలోని ప్రజలను చూసుకునే బాధ్యతను తనపై మరియు రాజకుటుంబంపై తీసుకున్నాడు. దీని తరువాత త్రిపాదిదానం,అనగా ఆలయానికి విరాళం ఇచ్చే సంప్రదాయం జరిగింది. 1965లో ట్రావెన్‌కోర్ చివరి మహారాజు శ్రీ పద్మనాభ దాస శ్రీ చిత్తిర తిరునాళ్ బల రామవర్మ, మతపరమైన సమర్పణలు మరియు విరాళాలు కొనసాగించేందుకు శ్రీ పద్మనాభ స్వామి ఆలయ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. నేటికీ, ఆలయాన్ని రాజకుటుంబం నేతృత్వంలోని ట్రస్ట్ నడిపిస్తుంది.

అయితే,జూన్ 2011లో, ఆలయ నిర్వహణలో పారదర్శకత మరియు ఆలయ సముదాయాన్ని తదుపరి దర్యాప్తు కోసం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఫలితంగా, పద్మనాభస్వామి ఆలయంలో ఆరు భూగర్భ ఖజానాలు కనుగొనబడ్డాయి. వాటికి తరువాత A, B, C, D, E, మరియు F అని పేరు పెట్టారు. ఆ వాల్ట్‌లను ప్రపంచానికి దూరంగా దాచిపెట్టిన మెగా తాళాలతో చాలా పోరాటం తర్వాత ఆరు వాల్ట్‌లలో ఐదు మాత్రమే తెరవబడ్డాయి వాటి నుండి

బంగారు నాణేలు, విగ్రహాలు, నగలు, విలువైన రాళ్ళు, కిరీటాలు మరియు సింహాసనాలు వజ్రాలు మరియు విలువైన రాళ్లతో పొదిగిన మహావిష్ణువు యొక్క 4-అడుగుల ఎత్తు 3-అడుగుల వెడల్పు ఘనమైన స్వచ్ఛమైన-బంగారు విగ్రహం; దేవత యొక్క 18 అడుగుల విగ్రహాన్ని ఉంచడానికి ఉద్దేశించిన ఘన బంగారు సింహాసనం; వేలకొద్దీ స్వచ్ఛమైన బంగారు గొలుసులు, వాటిలో ఒకటి 18 అడుగుల పొడవు; రోమన్ సామ్రాజ్యం మరియు మధ్యయుగ కాలం నాటి బంగారు నాణేలతో నిండిన బస్తాలు బయటపడ్డాయి. సంపద యొక్క సరైన అంచనా మరియు నిర్వహణలో మార్పు కోసం భారత సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేయబడింది. అయితే, 2020లో, రాజకుటుంబం పోరాటంలో గెలిచి ఆలయ నిర్వహణ మరియు దానితో వచ్చే ప్రతిదానిపై వారి ఏకైక అధికారాన్ని చేజిక్కించుకుంది.

వివిధ వార్తా నివేదికల ప్రకారం, ఎంత ప్రయత్నించినా వాల్ట్ B తెరవబడలేదు. కాగా,వాల్ట్ B యొక్క తలుపు వెనుక ఏదైనా ఉంటే, అది విషపూరిత పాములు, రక్త పిశాచులు మరియు అతీంద్రియ శక్తులచే రక్షించబడుతుందని ఆ

ఖజానాను తెరవడానికి ప్రయత్నించే ఎవరైనా తీవ్రమైన ఇబ్బందులకు గురి కావాల్సిందే అని నమ్ముతారు. రహస్యమైన వాల్ట్ B గురించిన మరొక కథనం ఏమిటంటే, B వాల్ట్ అరేబియా సముద్రానికి తెరుచుకుంటుందని కొంతమంది ఆలయ అధికారులు ఖజానా తలుపు తెరవడానికి ప్రయత్నించగా అకస్మాత్తుగా పెద్ద పెద్ద అలలు కూలిన శబ్దాలు గమనించి వారు ఆ ప్రయత్నాన్ని వదులుకున్నారని చెప్పుకోసాగారు. పాములో,అరేబియన్ సముద్రపు అలలో అనేది మిస్టరీ గానే మిగిలిపోయిన, ఆలయ నిధికి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి చేరులు, పాండ్యులు, పల్లవులు, చోళులు మరియు మరెన్నో రాజ్యాల కాలం నుండి వారందరూ ఉదారంగా విరాళాలు ఇచ్చారని కచ్చితంగా చెప్పొచ్చు.

What do you think?

133 Points
Upvote Downvote

2022 టాప్ 5 జీ5 సినిమాలు,సీరీస్లు #పార్ట్ 1

పండగ వేళ కోడి పందాల జాతర… ఏపీ అంతా ఉందిరా…