ప్రతి ఏడాది సంక్రాంతికి కొత్త బట్టలతో పాటు కోడి పందాలు వేయందే అది పండగ అనిపించుకోదని అంటుంటారు.మరి అలాంటి పండగ వేళ ఆంధ్రాలో ఎక్కడెక్కడ కోడిపందాలు జరుగుతున్నాయో…ఎలా జరుగుతున్నాయో… ఒక సారి చూసేద్దామా.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి.ఎక్కడ చూసినా కోడి పందాల బరులే కనిపిస్తున్నాయి.
మరోవైపు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా చాలా చోట్ల కోడి పందాల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు.కొన్నిచోట్ల కోడి పందాలతో పాటు గుండాట బరులు వెలిశాయి.ఈ కోడి పందాల్లో,వాటి సందర్భగా అక్కడే జరిగే కొన్ని జూధపు ఆటలలో కోట్ల రూపాయలు చేతులు మారతాయని అందరికీ తెలిసిందే.ఆయితే ఇక్కడ పాల్గొనేవారి కోసం క్యూ ఆర్ కోడ్ పేమెంట్ సౌకర్యం కూడా కల్పించడం విశేషం.
ఇదిలా ఉండగా మూడు రోజుల పాటు జరిగే ఈ కోడిపందాలలో రాత్రి వేళలో కూడా కొనసాగేలా బరుల వద్ద ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయగా.. కోడి పందాల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు ఏపీకి భారీగా చేరుకుంటున్నారు.కాగా పలుచోట్ల కోడి పందాలను ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్నారు.
అయితే ఈ కోడి పందాలను అడ్డుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ చాలా చోట్ల ప్రజాప్రతినిధులు ఈ కోడి పందాలను నిర్వహిస్తుండటంతో పోలీసులు కూడా చూసిచూడనట్టుగా ఉంటున్నారని మాటలు వినిపిస్తున్నాయి.
ఏదెలా ఉన్నా పందెం రాయ్యుళ్లు పందాలు వేసే తీరతారు.ఈ మూడు రోజులు ఆ పందాల్లో కోట్ల రూపాయల డబ్బు చేతులు మారే తీరుతుంది.
ఇక ఈ పందాలు,గొడవలు మాటలు వదిలేస్తే ఏడాదికి ఒక సారి వచ్చే పెద్ద పండగ ఈ సంక్రాంతి కాబట్టి గారెలు,బూరెలు వండుకుని ఈ మూడు రోజులు కడుపు నిండా తినేసి… కుదిరితే కోడి పందాలు చూసేయండి.
పండగ వేళ కోడి పందాల జాతర… ఏపీ అంతా ఉందిరా…
