in

యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్. కొత్త యూట్యూబ్ యాప్

యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్. కొత్త యూట్యూబ్ యాప్

ప్రముఖ వీడియో షేరింగ్ / స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ వీడియో క్రియేటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వీడియోలను సులువుగా రూపొందించుకునేలా ఓ కొత్త యాప్ ను తీసుకురానున్నట్లు తెలిపింది.

వివరాల్లోకి వెళ్తే ఇటీవల ‘మేడ్ ఆన్ యూట్యూబ్’ పేరిట గూగుల్ ఓ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్లో వీడియోలను సులువుగా రూపొందించుకునేలా ‘యూట్యూబ్ క్రియేట్’ (youtube create app) అనే ఓ కొత్త యాప్ ను తీసుకొస్తున్నట్లు, అలాగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించిన డ్రీమ్ స్క్రీన్ (Dream Screen) ఫీచర్ ను కూడా టెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ డ్రీమ్ స్క్రీన్ సాయంతో షార్ట్ వీడియోలకు (Shorts) ఏఐ ఆధారంగా రూపొందించిన వీడియోలు, బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్లు జోడించటానికి వీలుంటుందని తెలిపింది.

అదే విధంగా ఈ కొత్త ‘యూట్యూబ్ క్రియేట్’ జనరేటివ్ ఏఐ ఆధారిత యాప్ లో ఎడిటింగ్ ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ క్యాప్షనింగ్, వాయిస్ ఓవర్, ట్రాన్సిషన్స్ వంటి ఫీచర్లు ఉంటాయని పేర్కొంది. టిక్టాక్ మాదిరిగానే బీట్-మ్యాచింగ్ టెక్నాలజీతో ఉండే రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ ను వినియోగదారులు వాడుకోవచ్చని తెలిపింది.

What do you think?

వణికిస్తున్న ‘స్క్రబ్ టైఫస్’.. 211కి చేరిన కేసులు

రైలుకు ఎదురెళ్లి వందలాది మంది ప్రాణాలు కాపాడిన పదేళ్ల బాలుడు