in

రైలుకు ఎదురెళ్లి వందలాది మంది ప్రాణాలు కాపాడిన పదేళ్ల బాలుడు

రైలుకు ఎదురెళ్లి వందలాది మంది ప్రాణాలు కాపాడిన పదేళ్ల బాలుడు

ఓ పదేళ్ల బాలుడు సమయ స్ఫూర్తితో వందలాది మంది ప్రాణాలు కాపాడాడు. రైల్వే శాఖ ప్రశంసలు అందుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే బెంగాల్ మల్దా జిల్లాలోని ముర్సెలీమ్ అనే పదేళ్ల బాలుడు శుక్రవారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు ఓ చిన్న చెరువు దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ స్థానిక రైలు పట్టాల కింద భారీ గుంత ఉండడం గమనించాడు. మరోవైపు అదే టైంలో పట్టాలపై వస్తోన్న కాంచన్ జుంగా ఎక్స్ ప్రెస్ కు ను చూసి ఎదురెళ్లి తన రెడ్ షర్ట్ విప్పి సిగ్నల్ ఇచ్చాడు.

బాలుడి సిగ్నల్ గమనించిన లోకో పైలెట్ వెంటనే రైలు నిలిపి వేశాడు. అనంతరం రైలు పట్టాల కింద గుంత చూసి బాలుణ్ని అభినందించాడు. తన సమయ స్ఫూర్తితో వందలాది మంది ప్రాణాలు కాపాడిన ముర్సెలీమ్ రైల్వే శాఖ కూడా  ప్రశంసించింది.

What do you think?

యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్. కొత్త యూట్యూబ్ యాప్

ప్లే స్టోర్ కు దీటుగా ఫోన్ పే ‘ఇండస్ యాప్ స్టోర్’