in

ప్లే స్టోర్ కు దీటుగా ఫోన్ పే ‘ఇండస్ యాప్ స్టోర్’

ప్లే స్టోర్ కు దీటుగా ఫోన్ పే ‘ఇండస్ యాప్ స్టోర్’

ఫోన్ పే మరో సరికొత్త రంగంలోకి అడుగు పెట్టబోతోంది. గూగుల్ ప్లే స్టోర్ (Google playstore) , యాపిల్ యాప్ స్టోర్ (apple app store) లకు దీటుగా ఫోన్ పే ఓ యాప్ స్టోర్ ను తీసుకురానుంది.

ప్రస్తుతం యాప్ స్టోర్ల విషయంలో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఫోన్ పే వాటికి సవాల్ విసిరేందుకు సిద్ధమైంది.

యాప్ డెవలపర్ల కోసం ఇండస్ యాప్ స్టోర్ (Indus Appstore) పేరుతో కొత్త వేదికను ప్రారంభిస్తున్నట్లు ఫోన్ పే తెలిపింది. ఈ స్టోర్ లో తమ అప్లికేషన్లను యాప్స్ లిస్ట్ చేయాలని డెవలపర్లను కోరింది. ఇండస్ యాప్ స్టోర్ లో ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. www.indusappstore.com వెబ్సైట్ ద్వారా యాప్స్ ను అప్లోడ్ చేయాలని పేర్కొంది. ఈ యాప్ స్టోర్ 12 స్థానిక భాషల్లో త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపింది.

కాగా తొలి ఏడాది డెవలపర్ల నుంచి తాము ఎలాంటి ఫీజూ వసూలు చేయబోమని పేర్కొన్న ఫోన్ పే, మరుసటి ఏడాది నుంచి మాత్రం స్వల్ప మొత్తంలో ఫీజు తీసుకుంటామని తెలిపింది. యాప్ డెవలపర్ల నుంచి ఎటువంటి ప్లాట్ఫామ్ ఫీజుగానీ, ఇన్-యాప్ పేమెంట్స్ కు కమీషన్ గానీ వసూలు చేయబోమని స్పష్టం చేసింది. అదేవిధంగా తమకు నచ్చిన పేమెంట్ గేట్వేను ఉచితంగా ఇంటిగ్రే చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది.

What do you think?

రైలుకు ఎదురెళ్లి వందలాది మంది ప్రాణాలు కాపాడిన పదేళ్ల బాలుడు

త్వరలో ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్ వారాహీ యాత్ర