in

ప్రియుడి కోసం వేల కోట్లు వదిలేసుకున్న ప్రేయసి

ప్రియుడి కోసం వేల కోట్లు వదిలేసుకున్న ప్రేయసి

సినిమాల్లో ఇద్దరు ప్రేమించుకున్నపుడు “తన కోసం కోట్ల ఆస్తినైనా వడిలేసుకుంటా..” అనే డైలాగులు వింటుంటాం. కానీ నిజం జీవితంలో అలా జరగడం చాలా అరుదు. ఒక వ్యక్తి కోసం ఆస్తుల్ని వదులుకుని వెళ్ళడం పిచ్చి పని అనుకుంటారు. అయితే ఇప్పుడు అలాంటి పిచ్చి పనినినే ఓ యువతి చేసింది. తన ప్రియుడి కోసం వేల కోట్ల ఆస్తుల్ని వదులేసుకుంది.

మలేసియాకు చెందిన ఏంజెలినా ఫ్రాన్సిస్‌ అనే యువతి ప్రముఖ వ్యాపారవేత్త ఖూ కే పెంగ్‌ కుమార్తె. అయితే ఆమె ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకునే సమయంలో జెడియా అనే అతనితో ప్రేమలో పడింది. ఈ విషయాన్నే ఏంజెలినా ఇంట్లో చెప్పగా ఆమె తల్లిదండ్రులు వారి పెళ్లికి ససేమీరా కుదరదన్నారు.

ఏంజెలినా కూడా తనను వదులుకోవడం కుదరదని చెప్పేసింది. దీంతో అతడికి దూరం అవ్వడమో లేదా వారసత్వాన్ని వదులుకోవడమో రెండిట్లో ఒకటి ఎంచుకోమని ఆమె తల్లిదండ్రులు కరాఖండిగా చెప్పేశారు.
అతను లేని జీవితం వద్దనుకున్న ఏంజెలినా ప్రియుడితోనే ఉండాలని నిర్ణయించుకుని వారసత్వంగా వచ్చే రూ.2500 కోట్లు విలువ చేసే ఆస్తిని వదిలేసుకుంది.

What do you think?

ఉత్తరప్రదేశ్ లో దేవుడికి తల అర్పించబోయిన వ్యక్తి

2023 వన్డే వరల్డ్‌కప్ ఆడనున్న బెన్ స్టోక్స్‌!