in

భార్య సీమంతంలో మోసాన్ని బయట పెట్టిన భర్త..

సీమంతంలో భార్య మోసం బట్టబయలు

ఇంకా రెండు మూడు నెలల్లో బిడ్డ పుట్టబోతుందని తెలిసిన ఒక జంట కుటుంబ సభ్యులను,స్నేహితులను సీమంతానికి ఆహ్వానించారు. అందరూ ఆ జంట కోసం ఆనంద పడ్డారు. కానీ ఆ సమయంలోనే భర్త అందరి ముందు ఒక గోర నిజాన్ని బయటపెట్టాడు. తన భార్య వేరే వ్యక్తితో లైంగికంగా వ్యవహరిస్తుందని బట్టబైలు చేశాడు. ఈ ఒక్క నిజంతో ఆ ఫంక్షన్ మొత్తం తలకింధులైపోయింది.
ఈ సంఘటన సౌత్ అమెరికాకు చెందిన అబ్లివియలో చోటు చేసుకుంది.

 

అబ్లివియాలో నివసిస్తున్న వ్యక్తి తన భార్య సీమంతానికి తన లాయర్ని కూడా పిలిచాడు. అక్కడ ఉన్న అందరికి తన లాయర్ని తీసుకువచ్చానని చెప్పి అసలు నిజాన్ని బయటపెట్టాడు. తన భార్య చెప్తునట్టుగా 4 నెలల గర్భవతి కాదని తను గర్భం దాల్చి 6 నెలలు అవ్తుందని ఆ బిడ్డ తన బిడ్డ కాదని వైద్య పరీక్షలతో సహా అందరి ముందు పూర్తి ఆధారాలు బయట పెట్టాడు. ఆపై తన భార్య తనను 3 సంవత్సరాలుగా వేరే వ్యక్తితో లైంగికంగా వ్యవహరిస్తూ మోసం చేస్తోందని చెప్పుకొచ్చాడు.

ఇదేంటని భార్య తల్లితండ్రులు అడగగా అది అబద్దమని చెప్తూ అవన్నీ నమ్మవద్దని కోరింది.అయితే ఆ భర్త అనుమానం రావడంతో తన ఇంట్లో రహస్యంగా కెమెరాలు అమర్చానని చెబుతూ తన భార్య వేరే వ్యక్తితో ఉన్న సమయంలో రికార్డ్ అయ్యిన వీడియోని అందరి ముందు ప్లే చేశాడు. ఆ వీడియోని ప్లే చేసే ముందు ఆ వ్యక్తి కూడా అదే ఫంక్షన్లో ఉన్నాడని చెప్పాడు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి వారి కుటుంబ సభ్యులలో ఒకరని తెలుసుకున్న వారు నోళ్ళు వెళ్ళబెట్టారు. ఫంక్షన్ గొడవగా మారింది.వచ్చిన వారందరూ అక్కడనుంచి వెళ్ళిపోతుండగా ఎవ్వరూ వెళ్లవద్దని ఈ ఫంక్షన్ వారిద్దరిధని వ్యంగ్యంగా చెప్పాడు బర్త. మోసం చేస్తూ ధైర్యంగా అక్కడికొచ్చిన ఆ కుటుంబంలో వ్యక్తిని అందరూ నిందించారు.

 

మొహం మీద కేక్ కొట్టి అక్కడ నుంచి తరిమేశారు. భార్య అక్కడ్నుంచి వెళ్ళిపోతున్న భర్తను ఆపడానికి ప్రయత్నిస్తూ తనని వదిలి వెళ్లవద్దని ఏం జరిగిందో వివరిస్తానని వెంటపడినప్పటికి భర్త వినే ఆలోచన కూడా చేయలేదు.ఆపై వాళ్ళు ఇంకా కలిసే అవకాశం లేదని విడిపోతున్నామని అందుకే లాయర్ని కూడా వెంటపెట్టుకుని వచాన్నని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.

What do you think?

మేరీ సెలేస్టే….. పడవా..? పిశాచ..?

మీకు టెర్మినల్ మాన్ తెలుసా? అతనిక లేడు.